మనం రోజూ వాడే ముఖ్యమైన వస్తువుల్లో గ్యాస్ లైటర్ ఒకటి. అది కనిపించకపోయినా.. వెలగకపోయినా.. వచ్చే చిరాకు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే మీరు వంటగదిలో స్టవ్ వెలిగించాలన్నా.. పూజ గదిలో దీపాలు వెలిగించాలన్నా.. క్యాంపింగ్‌లో ఫైర్ స్టార్ట్ చేయాలన్నా.. ఇలా అన్నిటికీ ఒకే స్మార్ట్ లైటర్ని వాడొచ్చు. అదే బెలోక్సీ యూఎస్బీ ప్లాస్మా రీచార్జబుల్ లైటర్.
ఇది మనం రెగ్యులర్‌గా వాడే లైటర్లా కాదు. ఇది ఫ్లేమ్‌లెస్, విండ్ప్రూఫ్ డిజైన్‌తో రూపొందింది. దీంతో ఎలాంటి పరిస్థితుల్లో.. దేన్నయినా వెలిగించొచ్చు. ఈ లైటర్ చాలా సేఫ్ కూడా. ఇతర లైటర్లతో పోల్చితే శబ్దం చాలా తక్కువ వస్తుంది. సేఫ్టీ స్విచ్ డిజైన్‌తో దీన్ని సురక్షితంగా వాడుకునే వీలుంది. దీనికి 10 సెం.మీ పొడవైన ఫ్లెక్సిబుల్ నెక్ ఉంది. 360 డిగ్రీల్లో ఎటైనా తిప్పుకోవచ్చు. లైట్‌వెయిట్ డిజైన్‌తో రూపొందించడంతో దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. క్యాండిల్స్, పటాకులను సురక్షితంగా వెలిగిస్తుంది. ఎల్ఈడీ బ్యాటరీ డిస్ప్లే ఉంది. 5 ఎల్ఈడీలు పూర్తిగా వెలిగితే ఫుల్ చార్జ్ అయినట్టు. ఒక్కసారి చార్జ్ చేస్తే 500 సార్లు వాడొచ్చు! యూఎస్బీ కేబుల్‌తో రీచార్జ్ అవుతుంది.
ధర: రూ. 289
దొరుకు చోటు: అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లు