పట్టణాలు, నగర దృశ్యాలు, భవనాలు, నిర్మాణాల అందాలను.. సృజనాత్మకంగా చిత్రీకరించడమే అర్బన్ – ఆర్కిటెక్చరల్ ఫొటోగ్రఫీ. మీ చేతిలోని మొబైల్ఫోన్తోనే.. ఎలాంటి ఖరీదైన పరికరాల అవసరం లేకుండానే.. ఆకాశహర్మ్యాలు, వీధులు, ఆధునిక డిజైన్లను అద్భుతంగా ఫొటోలు తీయవచ్చు. అందుకు అనుసరించాల్సిన పద్ధతులు, సృజనాత్మక ఆలోచనలను అవగాహన చేసుకోవాలి. అప్పుడే పట్టణ వాస్తుశిల్ప ఫొటీగ్రఫీ పట్టుబడుతుంది.
అర్బన్ – ఆర్కిటెక్చర్ ఫొటోలు.. నగర జీవితంపై ప్రత్యేక దృష్టి పెట్టేలా చేస్తాయి. ఆయా ప్రాంతాల సంస్కృతి, అక్కడి నిర్మాణ శైలిని కళ్లకు కడతాయి. ఆయా నగరాల చరిత్రను ఒకే ఫ్రేమ్‌లో వివరిస్తాయి.