డిజిటల్ యుగంలో జర్నలిజం కొత్త ఒరవడిని అందిపుచ్చుకుంది. స్మార్ట్ఫోన్లు, డేటా టూల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో వార్తలు వేగం పుంజుకున్నాయి. అయితే, ఈ డిజిటల్ జర్నలిజాన్ని సరైన పద్ధతిలో వాడకపోతే.. ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే.. ఈ తరం జర్నలిస్టులు డిజిటల్ ఇంటెలిజెన్స్‌తో రిపోర్టింగ్‌ను ఎలా షార్ప్ చేసుకోవాలి? ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎలా హెల్ప్ చేస్తాయి? ఆన్లైన్లో సెక్యూర్డ్‌గా ఉండటం ఎలా..? వంటి కొత్త విషయాలు తెలుసుకోవాలి.
జర్నలిజంలో టెక్నాలజీని వాడుకోవడం ఒక కళ! నేటి డిజిటల్ ప్రపంచంలో ప్రతి అంశానికి సంబంధించి కుప్పలు తెప్పలుగా డేటా అందుబాటులో ఉంటున్నది. ఏ సమాచారం అయినా వెతికి పెట్టే సెర్చ్ ఇంజిన్లు సదా మీ సేవలో అంటున్నాయి. అలాగని విషయం ఏదైనా.. నెట్టింట్లో ఈజీగా విశ్లేషణ చేసేయొచ్చు అనుకోవద్దు. అందుకు పలు రకాల విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉంది.
సులభతరమైన విశ్లేషణ: ఆన్లైన్ డేటాబేస్లు, సెర్చ్ ఇంజిన్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో లోతుగా పరిశోధన చేయాలి. సోర్స్‌లను వెరిఫై చేసుకోవాలి.
డేటా ఎనాలిసిస్: డేటా విజువలైజేషన్ టూల్స్, స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి సమాచారాన్ని ఆకర్షణీయంగా అందించాలి.
ఆడియెన్స్ ఎంగేజ్మెంట్: సోషల్ మీడియా కాన్వర్సేషన్స్ మానిటర్ చేసి, ఆడియెన్స్ బిహేవియర్‌ను అర్థం చేసుకుని, వారి ఆసక్తులకు తగ్గట్టుగా కంటెంట్ క్రియేట్ చేయాలి.
కంటెంట్ డిస్ట్రిబ్యూషన్: సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) టెక్నిక్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈ-మెయిల్ న్యూస్లెటర్స్తో కంటెంట్‌ను విస్తృతంగా చేరవేయొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్: ఆన్లైన్లో ఫ్యాక్ట్ చెకింగ్ రిసోర్సెస్, రివర్స్ ఇమేజ్ సెర్చ్, డిజిటల్ ఫోరెన్సిక్ సాయంతో మీకు అందిన సమాచారాన్ని వెరిఫై చేసుకోవాలి.
ఎథికల్ చాలెంజెస్: యూజర్- జనరేటెడ్ కంటెంట్‌ను హ్యాండిల్ చేయడం, ప్రైవసీ-సెక్యూరిటీ జాగ్రత్తలు, ఆల్గారిథమిక్ బయాస్, ఫిల్టర్ బబుల్స్‌ను నేవిగేట్ చేయడం లాంటి ఎథికల్ ఇష్యూస్‌ను డిజిటల్ ఇంటెలిజెన్స్‌తో అర్థం చేసుకోవచ్చు.
ఓపెన్-సోర్స్ ఇంటిలిజెన్స్ (OSINT) టూల్స్ డిజిటల్ జర్నలిస్టులకు చక్కని సోర్స్‌గా ఉపయోగపడతాయి. ఇవి రీసెర్చ్, డేటా ఎనాలిసిస్, వెరిఫికేషన్, ఇన్వెస్టిగేషన్స్‌లో సాయం చేస్తాయి. వ్యక్తులు, ఆర్గనైజేషన్స్ గురించి ఆన్లైన్ డేటాను సేకరించి, విజువలైజ్ చేయడానికి Maltego టూల్ బాగా పనిచేస్తుంది. ఇక ఇంటరాక్టివ్ చార్ట్స్, మ్యాప్స్, గ్రాఫ్స్ క్రియేట్ చేయడానికి Datawrapper టూల్‌ని వాడొచ్చు. వెబ్సైట్స్లోని గ్రాఫ్స్, ప్లాట్స్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి WebPlot Digitizer వాడొచ్చు. ఇమేజ్‌లను న్యూమరికల్ డేటాగా మార్చడానికి ఇది పనికొస్తుంది. Tabula టూల్‌తో PDF ఫైల్స్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. పాపులర్ వ్యక్తుల ఈ-మెయిల్స్ వెతికేందుకు Hunter సర్వీసుని వాడుకోవచ్చు. డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోల ఆథెంటిసిటీని వెరిఫై చేయడానికి Sensity టూల్‌ని వాడొచ్చు. ఇక ఈ-మెయిల్ హెడర్స్‌లో మాలిషియస్ ఆర్టిఫాక్ట్స్ ఎనలైజ్ కోసం Email Header Analyserని ఉపయోగించొచ్చు.
డిజిటల్ జర్నలిజంలో ఎదగాలంటే కొన్ని స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటంటే..
మల్టిమీడియా స్కిల్స్: వీడియోలు, పోడ్కాస్ట్, ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేయడం, ఎడిటింగ్ నేర్చుకుంటే మంచిది.
ఏఈవో-ఎనాలిటిక్స్: సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) బేసిక్స్ నేర్చుకుంటే మంచిది. ఎనలిటిక్స్ టూల్స్‌తో ఆడియెన్స్ పల్స్ పట్టుకోవచ్చు. స్టోరీల ఇంపాక్ట్‌ను అర్థం చేసుకోవచ్చు.
ఆడియెన్స్ ఎంగేజ్మెంట్: సోషల్ మీడియా, కామెంట్స్ సెక్షన్లో రీడర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి. వాళ్ల ఫీడ్‌బ్యాక్ కొత్త ఐడియాలు ఇస్తుంది.
ఫ్యాక్ట్ చెకింగ్: మిస్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైన ఈ యుగంలో ఫ్యాక్ట్-చెకింగ్ కీలకం. పబ్లిషింగ్కు ముందు నిజానిజాలు తప్పనిసరిగా నిర్ధారణ చేసుకోవాలి.
ప్లాట్‌ఫామ్ న్యూసెన్స్: ప్రతి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు ఒక ైస్టెల్, టోన్, ఫార్మాట్ ఉంటాయి. దానికి అనుగుణంగానే పనిచేయాలి. ఎవరో ఏదో చేశారని.. మీరూ దాన్నే అనుకరించొద్దు.
నెట్వర్కింగ్: ఇతర జర్నలిస్టులు, ప్రొఫెషనల్స్‌తో కనెక్ట్ అవ్వాలి. అప్పుడే సోర్స్ పెరుగుతుంది.
స్మార్ట్‌ఫోన్ మాస్టరీ: స్మార్ట్‌ఫోన్‌తో రిపోర్టింగ్, ఎడిటింగ్, బ్రాడ్‌కాస్టింగ్ చేయడం నేర్చుకోవడం అనివార్యం. ట్రెడిషనల్ ఎక్విప్మెంట్ లేనప్పుడు ఇది హెల్ప్ అవుతుంది.
డిజిటల్ జర్నలిస్టులు సెక్యూరిటీని కీలకంగా భావించాలి. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, సోర్సెస్‌ను ప్రొటెక్ట్ చేసుకోవడం ముఖ్యం. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలి. దీనివల్ల ఎక్స్ట్రా సెక్యూరిటీ లేయర్ వస్తుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ముఖ్యం. WhatsApp, Signal లాంటి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న మెసేజింగ్ యాప్స్ వాడటం మంచిది. ప్రైవేట్ బ్రౌజింగ్ కోసం Tor, DuckDuckGo లాంటి ప్రైవేట్ బ్రౌజింగ్ యాప్స్ లేదా incognito modeలో పెట్టుకోవాలి. VPNతో ఇంటర్నెట్ కనెక్షన్ ఎన్‌క్రిప్ట్ అవుతుంది. పబ్లిక్ Wi-Fiలో ఉన్నప్పుడు ఇది కీలకం. ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలి. Dropbox, Google Drive లాంటి ఎన్క్రిప్టెడ్ క్లౌడ్ స్టోరేజ్ వాడొచ్చు. ఫైల్స్ సేఫ్‌గా ఉంటాయి. Tails (https://tails.net/) లాంటి సెక్యూర్ OSను USBలో రన్ చేయొచ్చు. పబ్లిక్ Wi-Fiలో బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు ఇది బెస్ట్.
Canva: ఇన్ఫోగ్రాఫిక్స్, విజువల్స్ క్రియేట్ చేయొచ్చు.
Audacity: పోడ్కాస్ట్స్ని ఎడిట్ చేయొచ్చు.
InShot: మొబైల్లో వీడియో ఎడిటింగ్‌కు ఉపయుక్తం.
Google Analytics: ఆడియెన్స్ బిహేవియర్ ట్రాక్ చేయొచ్చు.
Hootsuite: సోషల్ మీడియా మేనేజ్మెంట్కు ఉపయోగపడుతుంది.
– అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్