సుదర్శన చక్రం.. విజయం సాధించావు వీరాధివీర
‘తెలివితో ప్రాణాలను నిలుపుకొంటూనే.. సాహసం చేసి, విజయం సాధించావు వీరాధివీరా.. శమంతకమణి ప్రసాధించిన భయంకరమైన వ్యాధులను నిర్మూలించే మహిమాన్విత బంగారు పత్రంతో పాటు ఆకలి కేకలను దూరంచేసే అక్షయాన్న పాత్ర, జలసిరులను కురిపించే జల కలశాన్ని సొంతం చేసుకొన్నావ్' అంటూ దైవవాణి రుద్రకు అభినందనలు తెలియజేసింది.
అది ఎవరు? ది మిస్టరీస్ ఆఫ్ ద్వారక-11
మళ్లీ కొనసాగిస్తూ.. ‘ముందే చెప్పినట్టు మిగిలిన రెండు అస్ర్తాలైన సుదర్శనచక్రం, పంచజన్యాన్ని.. నీ పూర్తి శక్తి-యుక్తులతో సాధించాల్సిందే. అదే జరిగితే, ఆ శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం విశ్వాంతరాళం నుంచి వచ్చే ఆపదల నుంచి భూమిని కాపు కాసే భూకవచంగా మారుతుంది. ఆనాడు కురుక్షేత్రంలో పాంచజన్యాన్ని పూరించిన ఆ కృష్ణనాదమే మనిషి మేధస్సును దాటుకొని ఏవైనా జీవులు దాడులకు పాల్పడితే, వాటిని నియంత్రించే జ్ఞానమణిగా దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది’ అంటూ కాసేపు ఆగి మళ్లీ కొనసాగించింది.
‘ముందుగా సుదర్శన చక్రం కథ చెప్తాను శ్రద్ధతో ఆలకించు. పూర్వం భూలోకంలో రాక్షసుల ఆగడాలు మరింతగా పెరిగిపోయాయి. వారిని సంహరించి ధర్మాన్ని కాపాడేందుకు శ్రీమహావిష్ణువు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో విష్ణువుకు, రాక్షసులకు మధ్య భీకర యుద్ధం సాగింది. అయితే, ఆ శ్రీమహావిష్ణువు ఎన్ని అస్ర్తాలు ప్రయోగించినా గాయాలపాలవుతున్న రాక్షసులు ఆ వెంటనే కోలుకొని మరింత అద్భుత శక్తితో యుద్ధంలోకి తిరిగి చేరుతున్నారు. దీంతో తనకు ఒక శక్తిమంతమైన ఆయుధం అవసరమని గ్రహించిన విష్ణువు.. పరమశివుడిని ప్రార్థించి ఘోరమైన తపస్సుకు సిద్ధమయ్యాడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి వెయ్యి కమలాలతో పూజ చేయాలని సంకల్పించాడు. నీకు గుర్తుందో లేదో.. ఈ భరతభూమిని నాశనం చేయడానికి కొందరు దుష్టులు భయానక సూక్ష్మక్రిముల ప్రయోగానికి సిద్ధమైతే, ఆ కాశీ విశ్వేశ్వరుడి సాక్షిగా నువ్వు వారి ఆట కట్టించావు. అదే క్షేత్రంలో తన పూజను చేయాలని శ్రీమహావిష్ణువు తలంచాడు’ అంటూ దైవవాణి పలకగానే, అందరూ ఆశ్చర్యపోయారు.
మళ్లీ దైవవాణి కొనసాగిస్తూ.. ‘కార్తిక మాస శుక్ల చతుర్దశి తిథి రోజున ఆ శ్రీ మహావిష్ణువు శివయ్యను పూజించేందుకు కాశీలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొన్నాడు. అక్కడి మణికర్ణికా ఘాట్లో స్నానం చేసిన తర్వాత, వెయ్యి బంగారు కమలాలను సిద్ధం చేసుకొన్నాడు. అయితే, సంప్రోక్షణ తర్వాత విష్ణువు పూజను ప్రారంభించే వేళ విష్ణు భక్తిని శివయ్య పరీక్షించాలనుకొన్నాడు. అప్పుడే, వెయ్యి కమలాలలో ఒక కమలాన్ని ఉద్దేశపూర్వకంగా మాయం చేశాడు. ఇంతలో పూజకు ఒక కమలం తక్కువ అయిన విషయాన్ని విష్ణువు గుర్తించాడు. దగ్గర్లో ఎక్కడా కమలాలు కనిపించట్లేదు. పూజా సమయం దగ్గరపడింది. రాక్షసులు పేట్రేగిపోతున్నారు. లోకమే అల్లకల్లోలంగా మారుతున్నది. దీంతో ఏంచేయాలో తోచని ఆ కమల నేత్రుడు.. చివరకు తన కన్నునే కమలంగా భావించి శివుడికి సమర్పించబోయాడు. విష్ణు భక్తికి పరవశించిన పరమశివుడు ప్రత్యక్షమై, లోకంలోనే అజేయమైన సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. అనంతరం ఆ సుదర్శన చక్రంతో విష్ణువు రాక్షసుల ఆటకట్టించాడు. ద్వాపరయుగంలోనూ శిశుపాలుడి మరణానికి ఈ చక్రమే ఆ శ్రీకృష్ణపరమాత్ముడికి సాయపడింది. ఇప్పుడు భవిష్యత్తులో పొంచి ఉన్న ఉల్కాపాతాల నుంచి భూమికి రక్షగా భూకవచంగా నీకు ప్రాప్తించనున్నది. అయితే..’ అంటూ దైవవాణి ఆగిపోయింది.
‘అయితే, దీన్ని సాధించాలంటే ఏం చేయాలి?’ అంటూ ఎంతో ఆత్రుతతో రుద్ర ప్రశ్నించాడు. దీంతో స్పందించిన దైవవాణి.. ‘వీరాధివీరా.. సుదర్శనచక్రం, పాంచజన్యాన్ని.. నీ పూర్తి శక్తి-యుక్తులతో సాధించాల్సిందే అని నీకు ముందే చెప్పాను. నీ శక్తిని ఇంతకు ముందే చూశా. ఇక నీ యుక్తిని చూడాలనుకొంటున్నా. నీకు సరిగ్గా ఒక విఘడియ (24 సెకండ్ల) సమయం ఇస్తా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తూ.. జవాబును వివరించాలి కూడా. నా ప్రశ్న ముగిసిన తర్వాత సమయం ఆరంభమవుతుంది. తప్పు సమాధానం చెప్పినా, గడువు దాటినా, అసలు సమాధానమే చెప్పకపోయినా.. ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లడం తప్ప నీకు మరో మార్గం లేదు. ప్రశ్నను జాగ్రత్తగా విను.. ‘వరం పొందిన వాడే, వరమిచ్చిన వాడి ఇల్లాలిని అదే వరంతో ముక్కలు చేశాడు. ఎలా?’ 1..2..3.. ’ అంటూ దైవవాణి 22 అంకెలను లెక్కపెట్టేలోగా రుద్ర కరెక్ట్ సమాధానం చెప్తూ వివరించాడు. రుద్ర ఏం చెప్పాడో మీరు కనిపెట్టారా?
సమాధానం
వరం పొందిన వాడే (మహావిష్ణువు),
వరమిచ్చిన వాడి (శివుడి) ఇల్లాలిని (సతీదేవి) అదే వరంతో
(సుదర్శన చక్రం) ముక్కలు చేశాడు.
– రాజశేఖర్ కడవేర్గు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

