రుక్మిణి పరిచయం ముందు..
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హీరో నాని సమర్పణలో ఆయన సోదరి దీప్తి గంటా నిర్మిస్తున్నారు.
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హీరో నాని సమర్పణలో ఆయన సోదరి దీప్తి గంటా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో నితిన్ కృష్ణ అనే రచయిత పాత్రలో కనిపించనున్నారు. తన భార్య రుక్మిణి పేరుతో ఆయన రాసిన కథలు ప్రచురితమవుతుంటాయి.
ఈ నేపథ్యంలో శనివారం కృష్ణ పాత్ర తాలూకు సరికొత్త వీడియోను విడుదల చేశారు. ఇందులో రుక్మిణి తన ప్రపంచంలోకి రాకముందు కృష్ణ జీవితం ఎలా ఉండేదనే అంశాన్ని ఆవిష్కరించారు. యువకుడైన కృష్ణ కలల్ని ఆవిష్కరిస్తూ ఈ వీడియో ఆసక్తికరంగా సాగింది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని చిత్రబృందం పేర్కొన్నది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, రచన-దర్శకత్వం: మురళీకాంత్ దేవసోత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

