కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా యువతలో ఐక్యూ స్థాయిలు తగ్గుముఖం పడుతున్నాయని ఇటీవలి పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. సాధారణ భాషలో ఐక్యూని తెలివి తేటలుగా భావిస్తారు. 20వ శతాబ్దంలో ఐక్యూ స్థాయిలు పెరుగుతూ వచ్చాయి. దీన్నే ‘ఫ్లిన్ ఎఫెక్ట్’ అంటారు. ఇప్పుడు వెనక్కి మళ్లుతుండటాన్ని ‘రివర్స్ ఫ్లిన్ ఎఫెక్ట్’ గా పిలుస్తున్నారు. యువతరంలో తగ్గుతున్న ఐక్యూ లెవెల్స్‌పై పరిశోధనలు జరిగాయి. అనేక అభివృద్ధి చెందిన దేశాలలో నిర్వహించిన అధ్యయనాలు యువతలో మేధో సామర్థ్యం తగ్గుతున్నదని ధ్రువీకరించాయి.
నార్వే అధ్యయనం (2018) : 1962 నుంచి 1991 మధ్య జన్మించిన సుమారు 7.3 లక్షల మందిపై జరిపిన పరిశోధనలో 1975 తర్వాత జన్మించిన వారిలో ప్రతి తరానికి ఐక్యూ సుమారు 7 పాయింట్లు తగ్గుతూ వస్తున్నదని తేలింది.
అమెరికా అధ్యయనం (2023) : నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు 2006 నుంచి 2018 మధ్య కాలంలో 4 లక్షల మందిపై పరీక్షలు నిర్వహించగా, ముఖ్యంగా భాషా సామర్థ్యం, గణిత సామర్థ్యంలో మార్కులు తగ్గాయని గుర్తించారు.