Samantha | మార్పు కోసమే ఊ.. అన్నాను : సమంత
Samanth Ruth Prabhu | ‘ఏమాయ చేసావే’ అంటూ అందరికీ మంత్రం వేసింది సమంతా రూత్ ప్రభు. వరుస అవకాశాలతో టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కరోనా టైమ్‌లోనూ వెబ్‌సిరీస్‌లు, ఓటీటీ కార్యక్రమాలతో అలరించిన సామ్, బాలీవుడ్లో కూడా జెండా ఎగరేస్తున్నది. నటిగా తనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించే ఏ అవకాశాన్నీ వదులుకోనంటూ సమంత పంచుకున్న ముచ్చట్లు..

రొటీన్‌కు భిన్నంగా ఏం చేయాలన్నా కష్టపడక తప్పదు. భిన్నమైన కథలను ఎంచుకున్నప్పుడు వాటిలోని ప్రతి అంశానికీ న్యాయం చేయాలి. అప్పుడే దర్శకుడి మనసులోని కథ యథాతథంగా తెరపై కనిపిస్తుంది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో రాజి విషయమే తీసుకోండి. ఒడుదొడుకులను తట్టుకునే పాత్ర. ఆ కష్టాన్నంతా నేనూ ఫీలైచేశాను. సందర్భాన్ని బట్టి ఐటెం సాంగ్ కూడా చేయాల్సి వచ్చింది. ‘పుష్ప’లో ‘ఊ అంటావా..’ పాటను కూడా ఒక చేంజ్‌గా, చాలెంజ్‌గా తీసుకున్నా.
ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు నచ్చదు. కథలో కొత్తదనం కావాలి. పాత్రలో భిన్నమైన కోణాలు ఉండాలి. రెండేండ్లపాటు వైవిధ్యమైన పాత్రల కోసం ఎదురుచూశాను. అప్పుడే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ కోసం అడిగారు. వెంటనే ఒప్పేసుకున్నా. రాజి పాత్రకు ప్రశంసలతోపాటు విమర్శలూ వచ్చాయి. ఒక స్త్రీ ఆవేదన ఆగ్రహంగా మారితే ఎలా ఉంటుందో ఈ పాత్ర నిరూపించింది. నాకు బాగా సంతృప్తిని ఇచ్చిన క్యారెక్టర్ అది.

ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకపోయినా నేను ఇండస్ట్రీకి వచ్చాను. నా మొదటి సినిమా హిట్ కాగానే జాక్‌పాట్ కొట్టానని అంతా అనుకున్నారు. నిజానికి, నా కెరీర్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మొదటి సినిమా చూడగానే, స్క్రీన్‌పై నేను అంత అందంగా లేనని నాకే అనిపించింది. దీంతో నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకున్నా. ఆత్మన్యూనతతో కుంగిపోతున్న వారికి చేయూతనిచ్చే ప్రయత్నంలో ఉన్నానిప్పుడు.
సోషల్ మీడియాలో నా ఆలోచనలు పంచుకోవడం, వాటిపై అభిమానుల స్పందనలు, అభిప్రాయాలు తెలుసుకోవడం, వాళ్ల సందేహాలకు సమాధానాలు ఇవ్వడం నాకెప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదు. నా అంతట నేను వారిని నా జీవితంలోకి ఆహ్వానించాను కాబట్టి, వాళ్లడిగే ప్రతి ప్రశ్నకూ నేను సమాధానం చెప్పాల్సిందే. అది నా బాధ్యత. కానీ సమస్యంతా కొన్ని చానళ్లతోనే. వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు అల్లేస్తున్నాయి.

మనసుకు ప్రశాంతత అవసరం అయినప్పుడల్లా నాకు హిమాలయాలే గుర్తొస్తాయి. ఆ వెండికొండల్లో నన్ను నేను చూసుకుంటాను. ‘మహాభారతం’ చదివాక ఆధ్యాత్మిక యాత్రలపై ఆసక్తి కలిగింది. అందుకే చార్ధామ్ వెళ్లొచ్చాను. సరైన సమయంలో, సరైన వ్యక్తులతో, సరైన ప్రదేశాలకు వెళ్లడం చాలా అవసరం. ప్రతి మనిషీ చనిపోయేలోపు ఒక్క సారైనా హిమాలయాలు చూడాల్సిందేనని నా అభిప్రాయం.
Read More :
“Samantha | దుబాయ్‌లో సమంత..ఇంతకీ ఎవరిని కలిసిందో తెలుసా..?
Samantha | ఇన్స్టాగ్రామ్ ద్వారా సమంత నెలకు అన్ని కోట్లు సంపాదిస్తుందా?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

