రియల్ వృద్ధి
వరంగల్ నగరం సమీపంలోని మామునూరు, బొల్లికుంట పరిసర రోడ్ సైడ్ గ్రామాల్లో ఎకరానికి రూ. 20 నుంచి రూ.30 లక్షలు పలికితే ఎక్కువ. ఇప్పుడు మామునూర్ సమీపంలోని నక్కలపల్లి ప్రాంతంలో విమానాశ్రయానికి అవసరమైన భూమిని ప్రభుత్వమే ఎకరానికి రూ.1.20 కోట్లు చెల్లించి సేకరిస్తుండటం గమనార్హం.
తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచే ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు, ఆయా జిల్లాల పరిధిలో ఉన్న రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీల పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపార పురోగతి మొదలైంది. ఎప్పుడైతే తెలంగాణలో 33 జిల్లాలు ఉనికిలోకి వచ్చాయో… రియల్ ఎస్టేట్ రంగంలో ర్యాపిడ్ మార్పులు చోటు చేసుకున్నాయి.
జిల్లా కేంద్రాలన్నీ భవిష్యత్తులో ప్రధాన నగరాలుగా మారుతాయన్న నమ్మకం ఏర్పడటం, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు కొత్తగా వెలవడం మొదలు కావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్క జిల్లా కేంద్రంలోనే కాదు… ఆయా జిల్లా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, పెద్ద మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లోనూ భూముల ధరలు క్రమంగా వృద్ధి చెందాయి.
అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందిన ఆసిఫాబాద్ పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడంతో అక్కడి భూముల ధరలు పెరిగిపోయాయి. 2016కు ముందు పది లక్షలున్న ఎకరం భూమి తర్వాత అరకోటికి పైగా పలికింది. ఇక వరంగల్ జిల్లాలోనైతే భూముల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగాయి. తమ అవసరాల కోసం ప్రభుత్వం సేకరించేందుకు సిద్ధపడ్డ భూమికే రూ.కోటికి పైచిలుకు పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయింది.
ఒకప్పుడు వరంగల్ నగరం సమీపంలోని మామునూరు, బొల్లికుంట పరిసర రోడ్ సైడ్ గ్రామాల్లో ఎకరానికి రూ. 20 నుంచి రూ.30 లక్షలు పలికితే ఎక్కువ. ఇప్పుడు మామునూర్ సమీపంలోని నక్కలపల్లి ప్రాంతంలో విమానాశ్రయానికి అవసరమైన భూమిని ప్రభుత్వమే ఎకరానికి రూ.1.20కోట్లు చెల్లించి సేకరిస్తుండటం గమనార్హం. ఇక ఓపెన్ మార్కెట్లో భూ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించలేం.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా భూముల రేట్లకు రెక్కలు వచ్చాయంటే.. ప్రభుత్వ పాలసీతోపాటు జిల్లాల పునర్విభజన అందుకు దోహదం చేసిందని చెప్పవచ్చు. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన నిధులు సమకూరాయి. కాంగ్రెస్ రాకతో మళ్లీ భూముల ధరలు పాతాళం వైపు చూస్తున్నాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

