తలపెట్టిన కార్యాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. లాభదాయకంగా పనులు పూర్తిచేస్తారు. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి, కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులు, నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి. గతంలో నిలిచిపోయిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు. నిర్మాణాత్మక పనులు చేపడతారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశాల్లో విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కళాకారులకు మంచి కాలం. కొత్తగా పరిచయమయ్యే వ్యక్తుల ద్వారా నష్టపోయే ప్రమాదం ఉంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సంయమనంతో వ్యవహరిస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు చర్యలతో వృథాఖర్చులు అవుతాయి. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. నూతన ఒప్పందాలు ఫలిస్తాయి.
పిల్లల పెండ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. విద్యార్థులకు అనుకూలం. పెద్దల సలహాలు పాటించండి. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలు వచ్చినా, రాబడిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో స్థానచలన సూచన. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. పారిశ్రామిక వేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. తీర్థయాత్రల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చుల నియంత్రణ అవసరం.
ప్రయాణాలు కలసివస్తాయి. సంయమనంతో పనులు చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వస్తువులు కొనడంలో అప్రమత్తత అవసరం. పాతబాకీలు వసూలు అవుతాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాల జోలికి వెళ్లకుండా పనులపై మనసు నిలపడం అవసరం. ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. స్థిర, చరాస్తుల విషయంలో తగాదాలు ఉంటాయి. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.
అనుకున్న పనులు నెరవేరుతాయి. గతంలో అప్పుగా ఇచ్చిన సొమ్ము, చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలనం ఉండవచ్చు. అధికారులతో, నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కొత్త వస్తువులు కొంటారు. భూ లావాదేవీలు కలసివస్తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కళాకారులకు అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. స్నేహితులు, బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి. పెట్టుబడుల మూలంగా ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త అవసరం. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేపడతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. పనిభారంతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
అందరి సహకారం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయటా సంతృప్తికరంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం అవసరం. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. పై అధికారులతో సఖ్యత కొనసాగిస్తారు. స్థానచలనం, పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. సాహితీవేత్తలకు అనుకూలం. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో రాణిస్తారు. డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యాపార ఒప్పందాలు కలసివస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులు రాణిస్తారు. అనవసరమైన ఆలోచనలను మాని, కార్య నిర్వహణపై మనసు నిలుపుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలపై మనసు నిలుపుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. కళాకారులు కొత్త అవకాశాలతో సంతృప్తిగా ఉంటారు. విహారయాత్రలు చేపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. పనిభారం పెరగడంతో శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం. వివాదాలకు దూరంగా ఉంటారు. వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. భూ లావాదేవీల్లో ఖర్చులు ఉంటాయి.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృథా ఖర్చులతో ఇబ్బందులు రావచ్చు. సంయమనంతో ఉండటం అవసరం. కుటుంబసభ్యులతో సంతృప్తిగా ఉంటారు. వాహనాల మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. కోర్టుపనులు కలిసివస్తాయి. ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తారు. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. భక్తి పెరుగుతుంది.
భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. బయటి వ్యక్తులతో పనులు నెరవేరుతాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆఫీసులో అధికారుల సహకారం లభిస్తుంది. నలుగురిలో గుర్తింపు పొందుతారు. స్నేహితులు, బంధువుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. వ్యవసాయదారులకు అనుకూలం. రాబడి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు బాగా రాణిస్తారు. శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు.
ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త బాధ్యతల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. సంయమనం అవసరం. స్నేహితులు, బంధువర్గం సహకారం లభిస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు సాధిస్తారు. ఇంట్లోకి కావలసిన వస్తువులను కొంటారు. వృథా ఖర్చుల నియంత్రణ అవసరం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఉత్పాదన పెరుగుతుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి మేలు జరుగుతుంది.
ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. తలపెట్టిన ప్రయాణాలు ఫలిస్తాయి. కార్యస్థలంలో అందరితో స్నేహంగా ఉంటూ, పనులు పూర్తిచేస్తారు. శుభకార్యాల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. తీర్థయాత్రలకు వెళ్లవచ్చు. కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. పదోన్నతి, స్థాన
చలన సూచన. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు న్యాయ సమస్యలను అధిగమిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. వ్యవసాయదారులకు అనుకూలం. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in