పుస్తక సమీక్ష
కరోనా మన దేశం వరకూ రాదనుకున్నారు. వచ్చినా మన వాతావరణంలో ఉండదన్నారు. పొరపాటున సోకినా జీవనశైలి కారణంగా అంతగా ప్రభావం చూపదని తీర్మానించుకున్నారు. కానీ, ఒక్కసారి ఎల్లలు దాటొచ్చిన సూక్ష్మక్రిమి మహమ్మారిగా విజృంభించింది. ఊరూరూ చేరింది.
కరోనా కన్నీటి చారిక
కరోనా మన దేశం వరకూ రాదనుకున్నారు. వచ్చినా మన వాతావరణంలో ఉండదన్నారు. పొరపాటున సోకినా జీవనశైలి కారణంగా అంతగా ప్రభావం చూపదని తీర్మానించుకున్నారు. కానీ, ఒక్కసారి ఎల్లలు దాటొచ్చిన సూక్ష్మక్రిమి మహమ్మారిగా విజృంభించింది. ఊరూరూ చేరింది. ఇంటింటినీ పలకరించింది. మనిషి మనిషిలో భయాన్ని పుట్టించింది. ఆ భయం ఎలాంటి ఉత్పాతాన్ని సృష్టించిందో హృద్యంగా చిత్రించిన నవలే ‘లోపలి విధ్వంసం’. వర్తమాన విషయాలను విస్తారంగా వివరించడంలో సలీం శైలి ప్రత్యేకం. నవల ప్రారంభంలోనే జరగబోయే విధ్వంసాన్ని చెప్పకనే చెప్పాడు. తర్వాత అందమైన కుటుంబాలను పరిచయం చేశాడు.
కరోనా, లాక్డౌన్ ఆ కుటుంబాలను ఎలా పరీక్షించాయో అంచెలంచెలుగా కళ్లకు కట్టాడు. ఒకచోట అభిమానం గెలుస్తుంది. మరోచోట అనుమానం పిశాచమై కనిపిస్తుంది. ఇంకోచోట ఆప్యాయతలు గుండెను బరువెక్కిస్తాయి. ఒకచోట ఎడబాటు, ఇంకోచోట తడబాటు.. రకరకాల పాత్రలు, విభిన్న పార్శాలు. అనాథలుగా మిగిలిన కుటుంబాల వ్యథలు.. ఇలా ఒకటేమిటి కరోనా కాలంలో ఇంటింటా చోటుచేసుకున్న గాథలను అక్షరీకరించాడు రచయిత. కరోనా మిగిల్చిన భౌతిక విధ్వంసం గణాంకాల ద్వారా తెలుస్తున్నది. కానీ, మనిషి లోపల జరిగిన విధ్వంసాన్ని ఈ నవల రూపంలో మనకు అందించాడు రచయిత.
లోపలి విధ్వంసం
రచన: సలీం
పేజీలు: 204, ధర: రూ.150
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
…? కణ్వస

ఊహాలోక విహారం
మనుషులు పరిగెత్తిన శబ్దం.. ఆ వెనకే గుర్రాలు పరిగెత్తిన శబ్దం.. రాజ సైనికులకు దొరక్కుండా పరిగెడుతున్నారు వాళ్లు. అకస్మాత్తుగా ఆగిపోయాడు అధికారి చిరునవ్వుతో. ‘ఏమైంది?’ అడిగారు సైనికులు. ‘వాళ్లు ఆ రాజ్యంలోకి ప్రవేశించారు కదా.. ఇక మరణించినట్టే. దొంగలు, దుర్మార్గులు అక్కడ బతకలేరు‘ అన్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన రాకుమారుడు మంత్రి కుమారుడితో కలిసి కనుగొన్న వింతలూ, విచిత్రాలూ. సాహసాలూ, విజయాలూ.. మొత్తంగా ‘ధర్మనగరం’ నవలలోని ఒక్కో పేజీ మనల్ని ఓ కొత్తలోకంలోకి తీసుకెళ్తుంది. చిన్నప్పుడు అమ్మమ్మా నానమ్మల ఒళ్లో పడుకుని విన్న జానపద కథలన్నీ గుర్తుకొస్తాయి.
మనం తప్పు చేస్తే పంచభూతాలే శిక్షిస్తాయనే సందేశం ఈ కథలో అంతర్లీనం. కథానాయకుడి సాహసాలు, కథలోని మలుపులు థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తాయి. అలా అని, ఇది ఫక్తు పిల్లల జానపద నవలే అనుకుంటే పొరపాటు. పెద్దలు కూడా చదువుతూ చదువుతూ పిల్లలైపోవచ్చు. రచయిత్రి సుధా విశ్వం శైలి వినూత్నం.
ధర్మనగరం
రచన : సుధావిశ్వం
పేజీలు: అముద్రితం వెల: రూ.100
ప్రతులకు: అక్షర మీడియా గ్రూప్
ఫోన్: 63002 11910 (వాట్సాప్)
…? మనస్విత
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

