పుస్తక సమీక్ష
వెండితెరపై బంగారు కళ సినిమా. ఆ సినిమా కళాతపస్వి దర్శకత్వం వహించినదైతే.. వజ్రం తునకే! అలాంటి వజ్రాలు ఎన్నో తెలుగు సినీ కళామతల్లి కంఠహారంలో పొదిగారు కె.విశ్వనాథ్. తన అభిమతాన్నే.. ప్రేక్షకుడి అభిరుచిగా సినిమాలు తీయడం ఆయనకే చెల్లింది.
విశ్వనాథామృతం
వెండితెరపై బంగారు కళ సినిమా. ఆ సినిమా కళాతపస్వి దర్శకత్వం వహించినదైతే.. వజ్రం తునకే! అలాంటి వజ్రాలు ఎన్నో తెలుగు సినీ కళామతల్లి కంఠహారంలో పొదిగారు కె.విశ్వనాథ్. తన అభిమతాన్నే.. ప్రేక్షకుడి అభిరుచిగా సినిమాలు తీయడం ఆయనకే చెల్లింది. శంకరాభరణం ఎన్నిసార్లు చూశామో లెక్కే లేదు. ఆ సినిమా గురించి ఎన్నేసిసార్లు మాట్లాడుకున్నామో అంతే లేదు! ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘సిరివెన్నెల’, ‘సప్తపది’ ప్రతీ సినిమా కళల కౌముదే! సినీవాకిట విరిసిన సిరివెన్నెల విశ్వనాథామృతం. అలాంటి సినిమాలు సాదాసీదాగా చూసినా ఎంతో అనుభూతి చెందుతాం.
అలాంటిది ఆయా చిత్రాల్లోని సన్నివేశాల రూపకల్పన గురించి, వాటిని తెరకెక్కించడంలోని తపస్సు గురించి తెలిస్తే… మరెంత మైమరచిపోతామో కదా! అలాంటి ప్రయత్నమే చేశారు ‘కళాతపస్వి- కళాభరణాలు’ రచయిత రాకేశ్ బొద్దుల. కథ వెనుక సంగతులు మాత్రమే కాదు, సన్నివేశంలో కనిపించని అంతరార్థాన్ని కూడా విడమరచి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ పుస్తకం చదివిన తర్వాత.. ఆయా చిత్రాలను మళ్లీ చూడాలనుకుంటాం. ఆ వెంటనే చూసేస్తాం. మామూలుగా కాదు.. మరింత గాఢంగా చూస్తాం. చర్మ చక్షువులతో సినిమా చూస్తూనే.. మనో నేత్రంతో అందులో కళాతపస్వి విన్యాసాన్ని దర్శిస్తాం. చెవులతో వింటూనే.. మనసుతో అర్థం చేసుకుంటాం. మనస్ఫూర్తిగా మరోసారి విశ్వనాథ వారికి జై కొడతాం!
కళాభరణాలు
రచయిత: రాకేశ్ బొద్దుల
పేజీలు: 201, ధర: రూ.250
ప్రతులకు: 82477 65506
ఏకరాగం
రచన, సేకరణ : నాగేశ్వరి రూపాకుల
పేజీలు : 176;
ధర : రూ.150
ప్రచురణ : వంశీ ఆర్ట్ థియేటర్స్
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 98851 85876
నెమిలేటి సీతన్న నిత్యస్ఫూర్తి
రచన : నెమిలేటి కిట్టన్న
పేజీలు : 75;
ప్రచురణ : నెమిలేటి రచనలు
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 94901 82636
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

