పుస్తక సమీక్ష – శ్రీకృష్ణ భక్తిభావ సహిత శతకం
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు భగవంతుడి అవతారాలు. మనం ఎలా ఉండాలో మనలా ఉండి, ఆచరించి మరీ చూపారు. అందరూ శ్రీకృష్ణావతారంలో ఆ దేవదేవుడు ఎన్నో భోగాలు అనుభవిస్తూ, అందరినీ అలరించాడని అనుకొంటారు.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు భగవంతుడి అవతారాలు. మనం ఎలా ఉండాలో మనలా ఉండి, ఆచరించి మరీ చూపారు. అందరూ శ్రీకృష్ణావతారంలో ఆ దేవదేవుడు ఎన్నో భోగాలు అనుభవిస్తూ, అందరినీ అలరించాడని అనుకొంటారు. నిజానికి రామావతారంలోగానీ, కృష్ణావతారంలో గానీ మానవ రూపం పొందిన స్వామి ఎన్నో కష్టాలు పడ్డా, నిర్వికారంగా ప్రవర్తించాడు. బాలకృష్ణుడు పూతనాది రాక్షస సంహారాన్ని గావించాడు. కొంత పెద్దయ్యాక వెన్నదొంగగా, మిత్రులందరికీ వెన్నపంచాడు. ఆ తర్వాత కంసాదులను సంహరించి భూభారాన్ని తగ్గించాడు.
పాండవులకు అండగా నిలిచాడు. ఆయన ఈ జగత్తుకే గురువుగా నిలిచాడు. అజ్ఞానమనే చీకటిని తొలగించే భగవద్గీతను మనకు అందించాడు. ఆయన లీలలు ఎంత నుతించినా తనివితీరదు. యదుభూషణుడైన ఆ పరమాత్మను ఎంత కీర్తించినా మనకు తెలియనిది కొంత ఏదో మిగిలే ఉంటుంది. ఆ కృష్ణలీలామృతాన్ని 104 పద్యాలతో భక్తి నివేదన చేశారు రచయిత చంద్రప్రతాప్. అర్జునుడికి చేసిన కర్తవ్యబోధ, కాళీయుని సంస్కరించడం, గోపికల వస్ర్తాపహరణం, ద్రౌపదీ మాన సంరక్షణం ఇలా కృష్ణావతారంలోని ముఖ్యఘట్టాలన్నీ ఈ శతకంలో పొందుపరిచారు. భావసహితంగా రూపుదిద్దుకున్న శ్రీకృష్ణశతకం నేటి తరానికి, రాబోయే తరానికి భగవంతుడి గురించి తెలుసుకోవడంలోనూ, తెలుగు భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించడంలోనూ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
శ్రీకృష్ణ శతకం (భావ సహితం)
రచయిత: చంద్రప్రతాప్ కంతేటి
పేజీలు: 104, వెల: రూ.100
ప్రతులకు: 80081 43507
– డా॥ వి.వి. వేంకటరమణ
బుక్ షెల్ఫ్

త్రిలింగములు
రచన: కప్పగంతు వెంకట రమణమూర్తి
పేజీలు: 80;
ధర: రూ. 125
ప్రచురణ: గ్లోబల్ న్యూస్ ప్రచురణలు
ప్రతులకు: 92461 65059

గులకరాళ్లు
రచన: లలితా వర్మ
పేజీలు: 80;
ధర: రూ. 100
ప్రచురణ: జేవీ పబ్లికేషన్స్
ప్రతులకు:
ఫోన్: 99496 72671

ఆజాదీ
రచన: కరిపె రాజ్కుమార్
పేజీలు: 168;
ధర: రూ. 150
ప్రతులకు: 81251 44729
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

