Poco M6 Pro 5G | పొకో నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పొకో ఎం6 ప్రో.. ఇవీ డిటైల్స్..!
Poco M6 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. దేశీయ మార్కెట్లోకి బడ్జెట్ ధరలో పొకో ఎం6 ప్రో 5జీ ఫోన్ తీసుకొచ్చింది. 5జీ సెగ్మెంట్ ఫోన్లలో సమూల మార్పులు తీసుకొస్తుందని పేర్కొంది.
Poco M6 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీసంస్థ పొకో.. భారత్ మార్కెట్లోకి శనివారం తన ‘పొకో ఎం6 5జీ’ ఫోన్ తెచ్చింది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ చిప్సెట్ విత్ 18 వాట్ల చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నది. ఈ నెల తొమ్మిదో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ14 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. 6.79- అంగుళాల డిస్ ప్లేతో వస్తున్నది. పొకో నుంచి వస్తున్న స్మార్ట్ ఫోన్లలో అతిపెద్ద డిస్ ప్లే గల ఫోన్ ఇదే.
పొకో ఎం6 ప్రో ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,999, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.12,999లకు లభిస్తాయి. భారత్ మార్కెట్లో కేవలం ఫ్లిప్‌కార్ట్ సేల్స్ జరుగుతాయి. గ్లాస్ రేర్‌తో పవర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
షియోమీ సబ్ బ్రాండ్ పొకో ఎం6 ప్రో 5జీ ఫోన్ 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 3 లేయర్ ప్రొటెక్షన్ గల పొకో ఎం6ప్రో 5జీ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటది. మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ ఇస్తుంది.
50-మెగా పిక్సెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

