Naya Maal | ఇలా చేస్తే.. మీ కార్డులు భద్రం!!
షాపింగ్‌కి వెళ్లినా.. మార్కెట్లో ఏది కొన్నా.. అయితే డిజిటల్ పేమెంట్ లేదా కార్డులతో స్వైపింగ్! మరైతే, మీరు కూడా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు నిత్యం వెంటే పెట్టుకుంటున్నారా? అయితే, జర భద్రం! లేదంటే మనకు తెలియకుండానే మన కార్డుతోనే అనధికారికంగా చెల్లింపులు అయిపోతాయ్.
Naya Maal | షాపింగ్‌కి వెళ్లినా.. మార్కెట్లో ఏది కొన్నా.. అయితే డిజిటల్ పేమెంట్ లేదా కార్డులతో స్వైపింగ్! మరైతే, మీరు కూడా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు నిత్యం వెంటే పెట్టుకుంటున్నారా? అయితే, జర భద్రం! లేదంటే మనకు తెలియకుండానే మన కార్డుతోనే అనధికారికంగా చెల్లింపులు అయిపోతాయ్. అలర్ట్ మెసేజ్‌లు వచ్చేస్తాయ్. అప్పుడు చేసేది లేక వెంటనే కార్డుల్ని బ్లాక్ చేస్తుంటాం. సమస్య అంత దూరం వెళ్లకుండా.. కార్డుల్ని సేఫ్‌గా వాడుకోవాలంటే? ఇదిగో ఈ StealODeal Real Life Hero Front Pocket RFID కార్డు హోల్డర్ని ట్రై చేయండి. ఇందులో ఆరు కార్డుల్ని పెట్టుకుని సేఫ్‌గా ట్రావెల్ చేయొచ్చు. అంటే ఏ విధమైన ‘రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్’ ద్వారా కార్డుల్ని యాక్సెస్ చేసేందుకు వీలుండదు. RFID Blocking తో జన సంచారం ఎక్కువగా ఉన్నచోట కార్డులతో సురక్షితంగా ట్రావెల్ చేయొచ్చు. హోల్డర్ని వాటర్ రెసిస్టెంట్‌తో రూపొందించడంతో కార్డులు తడిసేందుకు అవకాశం లేదు. అంతేకాదు.. హోల్డర్‌కి లాక్ బటన్ కూడా ఉంది. దాన్ని ప్రెస్ చేస్తేనే బాక్స్ ఓపెన్ అవుతుంది.
ధర: రూ. 199
ముచ్చటగా మూడిటితో!

అవసరం మీద ఎప్పుడు ఏ గ్యాడ్జెట్ వాడతామో చెప్పలేం. ఒకసారి ఫోన్ అందుకుంటాం.. ఇంకోసారి ల్యాపీ ఆన్చేస్తాం.. అలాంటి సందర్భాల్లో కచ్చితంగా మనతో ఉండాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో ఈ అడాప్టర్. దీని పేరేంటంటే.. Kinsound 3-in-1 USB Type C HUb Adapter . ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ దేనితో పనిచేస్తున్నా అవసరం మేరకు ఈ అడాప్టర్‌ని వాడుకోవచ్చు. 4కే హెచ్డీఎంఐ పోర్ట్ హబ్‌తో వస్తుంది. దీంతో పెద్ద స్క్రీన్లకు ఇట్టే కనెక్ట్ అవ్వొచ్చు. యూఎస్బీ లేదా టైప్-సీ పోర్ట్‌తో దేనికైనా హబ్‌ని కనెక్ట్ చేయొచ్చు. కావాలంటే ఈ హబ్ నుంచే ఫోన్ లేదా ఇతర గ్యాడ్జెట్‌ను 100 వాట్స్‌తో చార్జ్ చేయొచ్చు. హై క్వాలిటీ అల్యూమినియం మెటీరియల్‌తో ఈ అడాప్టర్‌ని తయారుచేశారు. దీంతో ఎక్కవకాలం మన్నికగా వస్తుంది.
ధర: రూ. 599
దొరికే చోటు: అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్
సింపుల్ సెల్ఫీ స్టిక్

వచ్చేదంతా పండగల సీజన్.. అంతేనా! హాలీడేస్ కూడా. దీంతో టూర్స్ ప్లాన్ చేస్తారు. ఇంకేముందీ.. ఆ జాయ్‌ఫుల్ మూమెంట్స్ అన్నీ చక్కగా ఫొటోలు తీసుకోవాలి అనుకుంటారు. అప్పుడు కచ్చితంగా గుర్తొచ్చేది సెల్ఫీ స్టిక్. మరైతే.. బడ్జెట్లో ఏదైనా మంచి సెల్ఫీ స్టిక్ ఉందేమో అని చూస్తున్నారా? అయితే, ఇదిగోండి.. దీన్ని ప్రయత్నంచండి. పేరు Hold up Wireless R1 Bluetooth Selfie Stick. ప్రత్యేక రిమోట్ కంట్రోల్‌తో ఈ సెల్ఫీ స్టిక్‌ని వాడుకోవచ్చు. 120 ఎంఏహెచ్ బ్యాటరీతో రిమోట్ పనిచేస్తుంది. బ్లూటూత్ 4.0 వెర్షన్‌తో ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది. హ్యాండ్ హెల్డ్ మోడ్‌లో సెల్ఫీ స్టిక్లానే కాకుండా.. ట్రైపాడ్గానూ దీన్ని వాడుకునే వీలుంది. ట్రైపాడ్గా వాడుకునేటప్పుడు నేలపై బలంగా నిలబడేలా.. దీనికి మూడు లెగ్స్‌ని ఏర్పాటుచేశారు. వాటితో స్టిక్ స్థిరంగా నిలబడుతుంది. దీంతో మీరు వీడియో కాల్స్, సెల్ఫీ వీడియోలు తీసుకోవచ్చు.
ధర: రూ. 299
దొరికే చోటు: అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్
కంటెంట్ క్రియేటర్ల కోసం..

డాన్సింగ్, కుకింగ్, సింగింగ్.. దేంట్లో కాస్త కంటెంట్ ఉంది అనిపిస్తే చాలు. దానికి సాన పెట్టేసి.. ఓ యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసేస్తున్నారు చాలామంది. లైక్‌లు, వ్యూస్ కోసం చాలా ఫ్రొఫెషనల్ కంటెంట్ చేసేందుకు ఉన్న మార్గాల్ని అన్వేషిస్తున్నారు. అలాంటి వారికి ప్రాథమికంగా అవసరమయ్యేది మైక్. ఫీల్డ్ లేదా స్టూడియోలో వీడియో కంటెంట్ చేయడానికి అనువైన మైక్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదిగోండి.. V-Audio Pro మైక్‌ని ప్రయత్నించొచ్చు. దీన్ని 3.5 జాక్‌తో ఫోన్‌కి కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఒకవేళ మీరు స్టార్ట్ చేసిన చానెల్‌కి ఏదైనా లోగో ఉంటే.. దాన్ని మైక్‌కు సెట్ చేసుకునేలా ఓ బాక్స్ ఉంది.దానికి లోగోని అతికిస్తే సరి.
ధర: రూ. 199
దొరికే చోటు: అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

