పలుకుబడులు – దెసవత్తలోనికి బడవత్తలోడు బామ్మర్ది
ఏ పనికీ వెళ్లకుండా, ఏం చేయాలో పాలుపోకుండా నిత్యం రోడ్లమీద పడి తిరిగేవాళ్లు అక్కడక్కడా తారసపడుతుంటారు. ఇంట్లో వాళ్లు తెచ్చిపెడితే తింటూ.. కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా.. తమలాంటి మరికొందరిని వెంటేసుకుని తిరుగుతుంటారు.
ఏ పనికీ వెళ్లకుండా, ఏం చేయాలో పాలుపోకుండా నిత్యం రోడ్లమీద పడి తిరిగేవాళ్లు అక్కడక్కడా తారసపడుతుంటారు. ఇంట్లో వాళ్లు తెచ్చిపెడితే తింటూ.. కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా.. తమలాంటి మరికొందరిని వెంటేసుకుని తిరుగుతుంటారు. ఇలాంటివారిని ఉద్దేశించిన సామెతే.. ‘దెసవత్తలోనికి బడవత్తలోడు బామ్మర్ది’. ‘దెసవత్తలోడు’ అంటే.. కుటుంబానికి, సమాజానికి ఉపయోగం లేనివాడు, ఏపనీ చేతకానివాడు, ఏపనికీ చెల్లనివాడు. ఇలాంటి వాడికి అంతకంటే చెల్లనివాడు తోడైతే ‘బడవత్తలోడు’ అంటారు. ఇలాంటి గుంపు ఓ చోట చేరితే.. ‘బడవత్తల బ్యాచ్’! పాలమూరు జిల్లాలో ఈ సామెత బాగా వాడుకలో ఉంది. ఇలాంటి అర్థాన్నిచ్చే సామెతల్లో ‘ఆకులు నాకేవాడికి.. మూతులు నాకేవాడు తోడైనట్లు’, ‘జేబుకు చిల్లున్నోడికి.. జేబులు కుట్టేవాడు తోడట’ మొదలైనవీ ఉన్నాయి.
పదబంధం – తినే కూట్లో మన్ను బోసుకున్నట్లు
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేని వారిని ఉద్దేశించి జానపదులు ఎన్నో సామెతలు చెప్పారు. వాటిలో ఒకటి ‘తినే కూట్లో మన్ను బోసుకున్నట్లు’. చాలామంది అవకాశాలు లేక, కొత్తగా ఆలోచించలేక.. తమ జీవితం మలుపు తిరిగే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. మరికొందరు, వరుసగా అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోరు. ఇంకొంత మందేమో అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయపథంలో పయనించే సమయానికి.. తమ మూర్ఖత్వంతో అనుకున్న దాంట్లో అపజయం పాలవుతారు. సరిగ్గా అలాంటి వారినే ‘తినే కూట్లో మన్ను బోసుకున్నట్లు’ చేసిండు అంటుంటారు. ఇలాంటివారు తమకు తామే నష్టం చేసుకుంటారు.
తినే కూట్లో మన్ను పోసుకోవడం అంటే ఇదే. ‘ఈనగాచి నక్కల పాలుజేసినట్లు’, ‘నోటికాడికొచ్చిన కూడును కాలదన్నుకున్నట్లు..’, ‘నెత్తిన నిప్పులు పోసుకున్నట్లు’.. సామెతలూ ఇలాంటివే.
మన సామెతలు – అంబాజీపేట ఆముదంగాడు..
‘వామ్మో.. వాడొక అంబాజీపేట ఆముదంగాడు’ అంటుంటారు తప్పించుకుని తిరిగే వారిని ఉద్దేశించి. అంబాజీపేటలో పెరిగే ఆముదం మొక్కలు చాలా శ్రేష్టమని జానపదుల నమ్మకం. పూర్వం దొంగతనానికి బయలుదేరే ముందు చోరులు.. ఒంటికి ఆముదం పట్టించి మరీ బయల్దేరేవారట. దీంతో, పొరపాటున ఎవరైనా పట్టుకున్నా.. జారిపోయి, పారిపోయేవారు. పేరున్న దొంగలు అంబాజీపేట ఆముదాన్నే ఎక్కువగా ఉపయోగించేవారట. కొందరు తమ పనులు అయ్యేవరకూ జిడ్డులా పట్టుకుంటారు. ఓ పట్టాన వదలరు. అలాంటి వారిని కూడా అంబాజీపేట ఆముదంగాడితోనే పోలుస్తారు.
అర్థ వివరణ
కారెడ్డం మాటలు = వెటకారపు మాటలు (నలుగురిలోకి పిలిచి కారెడ్డంగా ఒర్లుతున్నవ్.. నన్ను నవ్వుల పాల్జేస్తున్నవ్. ఇట్ల ఉంటదానే ఓ పెద్దమనిషీ.. నీ పంచాతీ)
ఇల్లటం = ఇల్లరికం (ఉన్నదే ఒక్కగానొక్క బిడ్డ.. మా యాపారాలు, పొలాలు చూసుకోవడాన్కి ఇల్లటం వచ్చే అబ్బాయి కావాలె. మీ చుట్టుపక్కల, అయినోల్లల్ల ఎవలన్నా ఉంటే చెప్పుర్రి)
బెదురుబొమ్మ = దిష్టిబొమ్మ (పొలంల పెట్టిన బెదురుబొమ్మలా అలా నుంచోని చూస్తావేం.. వెళ్లి బావకు నీళ్లు పట్టుకురాపో..)
ఖాయమైంది = కుదిరింది (మల్లిగానికి లగ్గం ఖాయమైందట కదనే.. పాలోల్ల పిల్లనేనట ఆడు లగ్గమాడేది..)
సాయరం తప్పుడు = రుచి లేకపోవడం, తప్పడం (మొన్న సర్దయినకాడ్నుంచి నోరంతా సవసవగుంది. ఏం తిన్నా సాయరం తప్పుతున్నది.. తిన్నట్లే ఉంటలే)
-డప్పు రవి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
New Districts | కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల దశాబ్ది వేడుక
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?




