పండుగ నేర్పే పాఠాలు..
దసరా.. తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చాటే అతిపెద్ద పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రకృతి ఆరాధనను, సామాజిక ఐక్యతనూ ప్రతిబింబించే వేడుక. ఇవేకాదు.. సద్గుణాలైన ధర్మం, శాంతి, పట్టుదల ఎప్పటికైనా విజయం సాధిస్తాయనే సత్యాన్ని దసరా పండుగ మనకు బోధిస్తుంది.
దసరా.. తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చాటే అతిపెద్ద పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రకృతి ఆరాధనను, సామాజిక ఐక్యతనూ ప్రతిబింబించే వేడుక. ఇవేకాదు.. సద్గుణాలైన ధర్మం, శాంతి, పట్టుదల ఎప్పటికైనా విజయం సాధిస్తాయనే సత్యాన్ని దసరా పండుగ మనకు బోధిస్తుంది. జమ్మి ఇచ్చుకోవడం, అలయ్ బలయ్ చేసుకోవడం లాంటివి బంధాలను కలుపుకొని పోవాలని చెబుతాయి. ఇక జీవనాధారమైన పరికరాలకు కృతజ్ఞతలు చాటే వేడుక.. ఆయుధ పూజ. పాలపిట్ట దర్శనంలో ప్రకృతిని ప్రేమించడం కనిపిస్తే, శమీపూజతో సంస్కృతిని కాపాడుకోవడం అనే గొప్ప సందేశం దాగి ఉంటుంది.
అలయ్ బలయ్.. తెలంగాణ సామాజిక ఐక్యతకు ప్రతీక. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల మధ్య ప్రేమానురాగాలను, సద్భావనను పెంపొందించే వేడుక. గతం తాలూకు వైషమ్యాలు పక్కనపెట్టి పండుగనాడు అందరినీ దగ్గరికి తీసుకుంటారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. అలా.. బంధాలను కలుపుకొని పోతారు.
అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు.. పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచిపెడతారు. తిరిగి విజయదశమి రోజున వచ్చి జమ్మి చెట్టుకు పూజ చేసి, ఆయుధాలను తీసుకుంటారు. అందుకే, దసరా రోజున జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక తెలంగాణలో జమ్మి ఆకులను ‘బంగారం’ అని పిలుస్తారు. తమ మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు కలకాలం నిలవాలని.. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ, జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకుంటారు.

Mata
పాండవులు 12 ఏండ్ల అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని, తిరిగి వచ్చేటప్పుడు శుభసూచకంగా వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాతే వారు మహాభారత యుద్ధంలో విజయాన్ని సాధించారు. రావణాసురునిపై యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరాముడికి కూడా పాలపిట్ట దర్శనం అయిందట. అందుకే, దసరా రోజున పాలపిట్టను చూస్తే.. ఆ ఏడాదంతా అదృష్టం కలిసొస్తుందని, చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం లభిస్తుందని నమ్మకం.
ఆయుధపూజ.. దసరా రోజున నిర్వహించే మరో ప్రత్యేక కార్యక్రమం. నిత్య జీవితంలో ఉపయోగించే పరికరాలు, వృత్తికి సంబంధించిన ఆయుధాలు, యంత్రాలు, వాహనాలే మనకు జీవనాధారం. వాటిని దైవంగా భావించి, మనకు ఉపాధి కల్పిస్తున్నందుకు వాటికి కృతజ్ఞతలు తెలపడమే ఈ ఆయుధపూజ ఉద్దేశం. మహిషాసురుడితో తొమ్మిది రోజులు భీకర యుద్ధం చేసిన దుర్గాదేవి.. దశమి రోజున అసురుడిని సంహరించడానికి తన ఆయుధాలన్నింటినీ శక్తిమంతం చేసి పూజించిందని పురాణ కథనం.
పండుగ అంటేనే సరికొత్త శోభ, కొత్త ఉత్సాహం.
అందులోనూ దసరా నాడు కొత్త వస్ర్తాలు ధరించడం మరింత ప్రత్యేకం. కొత్త దుస్తులు సిరి సంపదలకు, సౌభాగ్యానికి సంకేతం. దసరానాడు నూతన వస్ర్తాలు ధరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలిగి.. ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని విశ్వాసం.

Palapitta
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

