‘కాశీకి.. రెండు టికెట్లు. ఒకటి నాకు. ఒకటి నాన్నకు’ చేతిలోని అస్థికల పాత్రను సీట్లో పెడుతూ కండక్టరుకు
చెప్పాడు.
ఇష్టమైనవాళ్లకు ఇష్టమైంది ఇచ్చి సాగనంపడం మా కుటుంబ సంప్రదాయం.
చిరునవ్వుతో ఆమెకు వీడ్కోలు పలికాను. అంతిమయాత్ర మొదలైంది.
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ విడాకుల నోటీసు అందుకున్నాడు. బంధాల కోసం సమయాన్ని ఇన్వెస్ట్ చేయడం మరిచిపోయాడు మరి!
శాడిస్ట్ భర్తను వదిలించుకునే ధైర్యం ఇచ్చాడు. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగేంత ధైర్యం మాత్రం చేయలేకపోయాడు.
ఊరికెళ్లడం ఉత్సాహకరం. ఊరొదిలి వెళ్లడమే బాధాకరం. ఓ కుటుంబం కరువు యాత్ర!