1. ఉప్పులం = పుట్టగొడుగు (వామ్మో.. ఇంట్లో ఉప్పులం మొలిచింది.. ఏం ముంచుకొస్తుందో ఏమో)
2. లాపర్వ = నిర్లక్ష్యం (నీకెందుకంత లాపర్వ.. నేను చూడకపోతే పిల్ల బాయిల పడుతుండె)
3. బచాయించు = బతికిపోవడం, ఆపద నుంచి తప్పించుకోవడం (వామ్మో.. రాజన్నగాడి చేతుల్లనుంచి బచాయించిన. లేకపోతే కత్తికొక కండగా చేస్తుండె)
4. రేవుకచ్చుడు = అప్పుడప్పుడే బాగుపడుతుండటం (తల్లినలుగురం చేయవట్టి ఇప్పుడిప్పుడే ఓ రేవుకస్తున్నం)
5. మంది బొందలమీద పెట్టుడు చేసిన కష్టమంతా పరులపాలు చేయడం (పొద్దంతా చేమటోడ్చంగ వచ్చిన సొమ్ముతో.. తాగి తందనాలాడి మంది బొందలమీద పెడుతుండు)