కడలి గర్భంలో..
అంతరిక్షంలో అనేక రహస్యాలు. కడలి గర్భంలోనూ అంతుచిక్కని రహస్యాలు. అయితే, మనిషి అంతరిక్షాన్ని శోధిస్తున్నాడు కానీ, అతిలోతైన సముద్రగర్భంలో దాగున్న వింతల్ని పూర్తిగా తెలుసుకోలేపోతున్నాడు.
పుస్తక సమీక్ష
అంతరిక్షంలో అనేక రహస్యాలు. కడలి గర్భంలోనూ అంతుచిక్కని రహస్యాలు. అయితే, మనిషి అంతరిక్షాన్ని శోధిస్తున్నాడు కానీ, అతిలోతైన సముద్రగర్భంలో దాగున్న వింతల్ని పూర్తిగా తెలుసుకోలేపోతున్నాడు. కడలి ఒడిలో మనకు తెలియని ఎన్నో జలచరాలు దాగున్నాయనడానికి ఈ చిన్న నవల అద్దం పట్టింది. అరేబియా సముద్ర జలాల్లో ప్రయాణించే అంజలిక షిప్ చీఫ్ సైంటిస్ట్ అధీర. ఓ రోజు డిన్నర్ చేశాక డెక్ మీద సమయం గడుపుతున్నప్పుడు అధీరకు ఓ వింతైన శబ్దం వినిపిస్తుంది.
దానికి తోడు ఊదా రంగు కాంతి రేఖ క్షణకాలం మెరిసి మాయమైపోతుంది. దాని గురించి తెలుసుకోవాలని తన టీంతో సహా సముద్రంలోకి వెళ్లిన ఆమెకు గోల్డెన్ ఎగ్ లభిస్తుంది. దాన్ని సేకరించిన తర్వాత కృత్రిమ మేధ సహాయంతో ఆ జీవి కష్టాన్ని తెలుసుకోవడం, అందులోని జీవి ప్రాణాన్ని కాపాడటం ఓ హాలీవుడ్ సినిమాను తలపిస్తుంది. శాస్త్రవేత్తగా తన కర్తవ్యాన్ని విస్మరించినా ఓ ప్రకృతి ప్రేమికురాలిగా ఆ జీవిని తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టడం అధీర చేసిన గొప్ప పని అనిపిస్తుంది.
మనం మంచి చేసినా కొంతమంది అధికారులు రూల్స్ పేరుతో ఆ పనులకు అడ్డుపడతారని చెప్పడానికి రావు పాత్రే సాక్ష్యం. అధీర చేసే పనిలో నిజాయతీ ఉంది కాబట్టే తన సస్పెన్షన్‌కు సరైన వివరణనిచ్చి తన ఉద్యోగాన్ని కాపాడుకోగలిగింది. సముద్రంలో మొదలైన శంకరన్, అధీరల పరిచయం కాస్తా గోవా బీచ్‌లో ప్రేమతో ఒక్కటవుతుంది. రచయిత ఈ నవలను సైన్స్ కోణంలోనే అందించినా పాఠకులకు బోర్ అనిపించకుండా మధ్యమధ్యలో శంకరన్, అధీరల మధ్య సంభాషణల ద్వారా పాఠకులకు ప్రేమను పంచుతారు.
తక్కువ పేజీల పుస్తకమే అయినా సముద్ర ప్రయాణంలో శాస్త్రవేత్తల పనితీరు, జీవరాశులను కనిపెట్టి ఈ ప్రపంచానికి తెలపడంలో వారు చేసే కృషిని వివరించిన తీరు బాగుంది. ఈ నవలలో మనకు కనిపించేది గోల్డెన్ ఎగ్ అనే ఒక్క జీవి మాత్రమే కానీ మనకు తెలియని ఎన్నో జీవులకు నిలయం సముద్ర గర్భం. వాటిని కాపాడుకోవడం మన ముందున్న కర్తవ్యం.
ఊదా రంగు సముద్రం (సైన్స్ ఫిక్షన్ నవలిక)
రచయిత: సలీం
పేజీలు: 60, ధర: రూ.80
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్
– రాజు పిల్లనగోయిన
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

