అలసిపోతే.. ఇలా చేయండి
ఎంతో హుషారుగా ఆఫీస్‌కు వస్తారు. మరింత ఉత్సాహంగా పని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం అయ్యేసరికి.. అలసిపోయి స్క్రీన్‌వైపు అలా చూస్తూ ఉండిపోతారు. దాని నుంచి బయటపడేందుకు కప్పుల మీద కప్పులు కాఫీ-టీలతోపాటు డబ్బాలకు డబ్బాలు సిగరెట్లు తాగేస్తుంటారు. ఫలితంగా.. లేనిపోని అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటారు.
చేంజ్ గురూ!
ఎంతో హుషారుగా ఆఫీస్‌కు వస్తారు. మరింత ఉత్సాహంగా పని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం అయ్యేసరికి.. అలసిపోయి స్క్రీన్‌వైపు అలా చూస్తూ ఉండిపోతారు. దాని నుంచి బయటపడేందుకు కప్పుల మీద కప్పులు కాఫీ-టీలతోపాటు డబ్బాలకు డబ్బాలు సిగరెట్లు తాగేస్తుంటారు. ఫలితంగా.. లేనిపోని అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటారు. అలా.. అలసట అనేది పనిలో ఉత్పాదకతతోపాటు ఉద్యోగి ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. ఈ క్రమంలో.. శరీరాన్ని, మనసును రీచార్జ్ చేసుకోవడానికి కొన్ని చిన్నపాటి చిట్కాలు సహాయపడతాయని మనస్తత్వశాస్త్రం చెబుతున్నది.
ఆఫీసులో మసకబారి ఉండే లైట్లు.. ఉద్యోగిని త్వరగా అలసటకు గురిచేస్తాయి. ఎందుకంటే, డిమ్ లైటింగ్ వల్ల డెస్క్ వాతావరణం సాయంత్రపు చీకటిని తలపిస్తుంది. అది ఉద్యోగి సర్కాడియన్ రిథమ్స్ (జీవగడియారం)ను దెబ్బతీస్తుంది. కాబట్టి, పని ప్రదేశంలో ప్రకాశవంతమైన, సహజమైన కాంతి ఉండేలా చూసుకోండి. అది ఉద్యోగుల్ని మరింత అప్రమత్తంగా ఉంచడంలో సహాయపడుతుంది. మెరుగైన లైటింగ్ వల్ల ఉద్యోగుల్లో అలసట తగ్గడంతోపాటు ఉత్పాదకత మెరుగుపడుతుందని 2023లో ఏపీఏ వర్క్ఇన్ అమెరికా చేపట్టిన పరిశోధన తేల్చింది.
గంటల తరబడి పని చేస్తే.. మెదడు మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంది. దీనికి ‘మైక్రోబ్రేక్స్’ తక్షణ పరిష్కారం చూపుతాయి. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఓ రెండుమూడు నిమిషాల పాటు చిన్న విరామాలు తీసుకుంటే.. మనసుకు విశ్రాంతి దొరుకుతుంది. మానసిక అలసట దూరమవుతుంది. కాబట్టి, ప్రతి 30-40 నిమిషాలకు ఒకసారి కుర్చీలోంచి లేచి నిలబడటం, స్ట్రెచ్ చేయడం, కిటికీ నుంచి కాసేపు బయట ప్రపంచాన్ని చూడటం అలవాటు చేసుకోండి. ఈ అలవాటు కొన్ని నిమిషాల్లోనే మిమ్మల్ని రీచార్జ్ చేస్తుంది.
అలసటకు ఆకలి కూడా ఓ కారణమే! అయితే, దీన్ని ఎదుర్కోవడానికి.. టీ/ కాఫీలను ఆశ్రయించకండి. బదులుగా నట్స్, బెర్రీలు, డార్క్ చాక్లెట్ లాంటి బ్రెయిన్-బూస్టింగ్ స్నాక్స్ తీసుకోండి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఈ ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచుతాయి. మానసిక మందకొడితనాన్ని తగ్గిస్తాయి.
అలసట తీవ్రమైనప్పుడు, గాలి పీల్చుకోవడంలోనూ ఇబ్బంది కలుగుతుంది. ఫలితంగా, మెదడుకు ఆక్సిజన్ అందక ఏకాగ్రత తగ్గుతుంది. కాబట్టి, డెస్క్ దగ్గర కూర్చొనే.. 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్‌ను ప్రయత్నించండి. 4 సెకన్ల పాటు గాలి పీల్చుకోండి. 7 సెకన్లు లోపలే ఆపుకోండి. 8 సెకన్ల పాటు గాలిని బయటికి వదలండి. ఇలా మూడుసార్లు చేయండి. ఇది మీ నాడీ వ్యవస్థకు ఒక విరామంలా పనిచేసి, పని గందరగోళం మధ్యలో కూడా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మీ ఏకాగ్రతను తిరిగి అందిస్తుంది.
వైతాళికుల వాణి
అలసిన శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో, బడలిక పొందిన మనసుకు ప్రశాంతత అంతే అవసరం.
– బీఎఫ్ స్కిన్నర్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త
క్యా సీన్ హై!

Cartoon
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- change
- do this
- feel tired
- guru
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

