డ్యాన్స్ సినిమా చేస్తాను!
‘మండాడి’ అనువాద చిత్రంతో ఇటీవల తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళి ముద్దుగుమ్మ మహిమా నంబియార్. తమిళ్, మలయాళి సినీ పరిశ్రమలలో తనదైన నటనతో క్రేజ్‌ను సొంతం చేసుకున్నది. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీవిష్ణుతో కలిసి ‘కామ్రేడ్ కళ్యాణ్'తో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా హిట్ కావడంతో సంబురాలు చేసుకుంటున్న మహిమా పంచుకున్న కార్వాన్ కబుర్లివి..
మాది కేరళంలోని కాసరగోడ్. నా అసలు పేరు గోపికా పాలట్ చిరక్కరవీట్టిల్. చిన్నప్పటినుంచి డ్యాన్స్ అంటే ఇష్టం.15 ఏండ్ల వయసులోనే ‘కార్యస్థాన్’తో మలయాళ ఇండస్ట్రీకి పరిచయమయ్యా. ఆ తర్వాత తమిళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నేను ఇండస్ట్రీలో అప్పటికే ఒక గోపిక ఉందని… నా పేరు మహిమా నంబియార్గా మార్చుకున్నాను.
శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’లో చేసే అవకాశం వచ్చింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. శ్రీవిష్ణు సమయస్ఫూర్తి గల నటుడు. షూటింగ్ సమయంలో సన్నివేశానికి తగ్గట్టుగా ఇంప్రువైజ్ చేస్తుంటాడు. ఆయనది ప్రత్యేకమైన సిగ్నేచర్ స్టయిల్ కూడా ఉంది.
తెలుగులో నా మొదటి సినిమా కామ్రేడ్ కళ్యాణ్. ఇందులో సితారదేవి పాత్రలో అమాయకంగా, పక్కింటి అమ్మాయిలా ఉండే క్యారెక్టర్ నాది. సినిమాలోని ‘ఒడియా పిల్లా’ పాటకు మంచి స్పందన వచ్చింది. తెలుగు అర్థమైనా ప్రతి డైలాగ్ డైరెక్టర్‌ను అడిగి తెలుసుకొని మరీ నటించాను.

Mahima Nambiar
నేను బాగా తింటాను. వెజ్-నాన్‌వెజ్ రెండూ లాగించేస్తా. పనసపండు మసాలా కూర, బీన్స్, చేపలు, రొయ్యలు ఇష్టంగా తింటాను. కేరళ సంప్రదాయ తిండి అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు స్వీట్స్ బాగా తినేదాన్ని కానీ ఇప్పుడు కాస్త తగ్గించాను.
సరైన సమయంలో ఉద్యోగం చేయాలి, పెండ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలనే ఒత్తిడికి ఈ తరం లోనుకావొద్దు. మీకు నచ్చిన పనినే చేయండి. నా దృష్టిలో ప్రేమ అనేది సూత్రాలకు కట్టుబడి ఉండదు. ఆ ప్రక్రియ జరగాల్సినప్పుడు దానంతట అదే జరుగుతుంది. ఇక సామాజిక మాధ్యమాల్లో చాలామంది సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాల్ల జోక్యం చేసుకుంటారు. అలాంటి వాటికి నేను వ్యతిరేకం.
ప్రస్తుతం తమిళ్, మలయాళంలో ఒక్కో సినిమా చేస్తున్నాను. తెలుగులోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. మంచి కథలు వింటున్నాను. ఒక నటిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. ఎప్పటికైనా డ్యాన్స్‌కు సంబంధించిన సినిమా చేయాలనే కోరికతో పాటు సినిమా పాటలు పాడాలనుంది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

