ఒరేయ్! నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లావు? ఆ పుట్టలో చేయి ఎందుకు పెట్టావు?
‘ఒరేయ్! నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లావు? ఆ పుట్టలో చేయి ఎందుకు పెట్టావు?’ అని ప్రశ్నించాడు. అప్పుడు శరభయ్య కన్నీటి పర్యంతమై.. ‘మిత్రమా! నిన్న దారిలో నాకొక బంగారు గొలుసు దొరికింది.
మిత్రునిలో మార్పు
నరసింహపురానికి చెందిన రామయ్య, శరభయ్య మిత్రులు. ఒకసారి ఇద్దరూ కలిసి పనిమీద కాలి నడకన పొరుగూరుకు బయలుదేరారు. రామయ్యకు దాహం వేసి ఒక బావి వద్ద మంచినీటి కోసం ఆగాడు. ఇంతలో ముందుకు వెళ్లిన శరభయ్యకు ఒక బంగారు గొలుసు దొరికింది. మిత్రుడు చూస్తాడని భావించిన శరభయ్య.. స్వార్థ బుద్ధితో ఆ బంగారు గొలుసును దగ్గరలో ఉన్న ఒక పాము పుట్టలో వేశాడు. ఆ పుట్టలో పాములు లేవని శరభయ్యకు ముందే తెలుసు. అతను తరచుగా ఆ దారి గుండా వచ్చేటప్పుడు.. అవి వట్టి చీమల పుట్టలేనని ఎంతోమంది చెప్పగా శరభయ్య విని ఉన్నాడు. అందుకే అతను ధైర్యంగా గొలుసును పుట్టలో వేశాడు. తెల్లవారి వచ్చి గొలుసును తీసుకొని పోవాలన్నది అతని ఆలోచన. దీనిని రామయ్య గమనించలేదు. మరునాడు శరభయ్య వచ్చి పాముల పుట్టలో చేయి దూర్చి, బంగారు గొలుసును తీసుకోబోయాడు. అయితే, ముందు రాత్రే ఒక పాము వచ్చి ఆ పుట్టలో తలదాచుకున్నది. గొలుసు కోసం శరభయ్య చేయి పెట్టడంతో.. భయపడి కాటు వేసింది. వెంటనే శరభయ్య.. ‘అమ్మో! నా చేతిని పాము కాటేసింది. నన్ను కాపాడండి!’ అని అరిచాడు. ఇంతలో రామయ్య రోజూలాగానే శరభయ్య ఇంటికి వెళ్లి, అతను లేకపోవడంతో మిత్రుణ్ని వెతుకుతూ అదే దారిలో వచ్చాడు. శరభయ్య అరుపులు విన్న రామయ్య వెంటనే మిత్రుని దగ్గరికి పరిగెత్తాడు. జరిగింది తెలుసుకొని శరభయ్య చేతికి కట్టు కట్టి, వైద్యుని దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ వైద్యుడు శరభయ్యకు చికిత్స చేసి అతని ప్రాణాలు కాపాడాడు. అప్పుడు రామయ్య.. ‘ఒరేయ్! నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లావు? ఆ పుట్టలో చేయి ఎందుకు పెట్టావు?’ అని ప్రశ్నించాడు. అప్పుడు శరభయ్య కన్నీటి పర్యంతమై.. ‘మిత్రమా! నిన్న దారిలో నాకొక బంగారు గొలుసు దొరికింది. నేను స్వార్థ బుద్ధితో ఆ గొలుసు సంగతి నీకు చెప్పలేదు. నీకు చెబితే అందులో వాటా అడుగుతావేమోనని.. ఆ గొలుసును పాముల పుట్టలో వేశాను’ అని అన్నాడు. అది విన్న రామయ్య.. ‘నీ సొమ్ము నాకెందుకురా? అవసరం పడితే నేనే నీకు డబ్బు సాయం చేసే వాడినిగా! ఎంత ప్రమాదం తప్పింది. ఇకముందు ఎప్పుడూ నాకు చెప్పకుండా వెళ్లకు. ఇలాంటి పనిచేయకు’ అని హితబోధ చేశాడు. ఆ తర్వాత మిత్రులిద్దరూ నగల వర్తకుని వద్దకు వెళ్లి.. ఆ బంగారు గొలుసును చూపించారు. అయితే, అది నకిలీదని ఆ వర్తకుడు చెప్పాడు. ‘అయ్యో! ఈ నకిలీ గొలుసు కోసమా నేను నా మిత్రుని దగ్గర స్వార్థంతో వ్యవహరించాను’ అని బాధపడ్డాడు. అప్పటి నుంచి రామయ్యతో మరింత సఖ్యంగా ఉండసాగాడు.
– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
మహనీయుల మాట
ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు.. మొదట నీతోనే మొదలవ్వాలి
– మహాత్మా గాంధీ

Mahatma Gandhi
చెప్పుకోండి
అడవిలో పుట్టింది. అడవిలో పెరిగింది. మా ఇంటికొచ్చింది. మహాలక్ష్మిలాగుంది
– గడప
ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?
– పొగ
ఇండ్లు లేని పట్టణాలు. నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ ఉంటాయి?
– మ్యాపులో
పద్యం – భావం
ఉన్నఘనతబట్టి మన్నింతురే కాని
పిన్న, పెద్దతనము నెన్నబోరు
వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మనిషి ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటే.. సంఘంలో అంత గొప్పగా గౌరవం అందుకుంటాడు. గొప్పతనానికి వయస్సుతో నిమిత్తం లేదు. శ్రీకృష్ణుడు.. తన తండ్రి అయిన వాసుదేవుని కంటే ఎక్కువగా గౌరవించి పూజలు అందుకున్నాడు. అందుకు అతని గొప్ప గుణాలే కారణం.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

