ప్రతి జిల్లాకు ప్రభుత్వ వైద్య విద్య
2015-16లో 2,493గా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల సంఖ్య, 2023-24 నాటికి 3,122కు చేరింది. అదే సమయంలో విద్యార్థి-అధ్యాపకుల నిష్పత్తి కూడా మెరుగుపడింది. 2015-16లో 26:1గా 2024 నాటికి 19:1కి చేరింది. అంటే ప్రతి విద్యార్థిపై అధ్యాపకుల దృష్టి మరింతగా కేంద్రీకరించే పరిస్థితి ఏర్పడింది.
విద్యతో పాటు వైద్య విద్యలోనూ తెలంగాణలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా మెరుగైన వైద్య సదుపాయాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్న విధానానికి అనుగుణంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఒక అవకాశంగా మారింది. 2016 నుంచి 2023 మధ్య కాలంలో కొత్త జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు లభించాయి. జాతీయ వైద్య కమిషన్ అనుమతులతో అనేక కళాశాలల్లో బోధన కూడా ప్రారంభమైంది.
జయశంకర్ భూపాలపల్లి, గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ములుగు వంటి చిన్న జిల్లాల్లో సైతం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పడటం వైద్య విద్య వికేంద్రీకరణకు నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ఒక ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే సుమారు 4,190 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు మెరుగైన వైద్యం కూడా చేరువైంది. మెడికల్ కాలేజీలతో పాటు నర్సింగ్ విద్యకు కూడా ప్రాధాన్యం పెరిగింది. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలనే విధానంతో వాటి సంఖ్య కూడా పెరిగింది. ఒకప్పుడు కేవలం 5 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఉండగా… ప్రస్తుతం ఆ సంఖ్య 36కు చేరింది.

Nlagonda Govt Medical Colla
జిల్లాల సంఖ్య పెరగడంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల విస్తరణకు కూడా కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. పది జిల్లాల తెలంగాణలో గతంలో 10 జవహర్ నవోదయ విద్యాలయాలు, 10 కేంద్రీయ విద్యాలయాలు ఉండేవి.
33 జిల్లాలుగా తెలంగాణ రూపుదిద్దుకున్న తర్వాత కొత్త జిల్లాల్లోనూ ఈ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరిగింది. ఇప్పటికే 7 జిల్లాల్లో కొత్తగా జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు కాగా, మరో 17 జిల్లాలు నవోదయ విద్యాలయాల మంజూరు కోసం ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే అనేక కొత్త జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. మొత్తంగా చెప్పాలంటే.. మట్టివాసనల తెలంగాణ.. ఉద్యమాల చైతన్య తెలంగాణ ఇప్పుడు విద్యా కాంతుల రాష్ట్రంగా కొత్త వెలుగులు విరజిమ్ముతున్నది.

Mahabubnagar Medical Collag
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

