ఇంటిని ‘స్మార్ట్ హోమ్’గా మార్చే క్రమంలో చాలామంది ‘స్మార్ట్ లైటింగ్’ కోసం చూస్తున్నారు. అలాంటివారి కోసం స్మార్ట్ హోమ్ లైటింగ్ బ్రాండ్ అయిన గోవీ.. తమ ఫ్లాగ్షిప్ మోడల్‌గా సరికొత్త Govee Floor Lamp 3ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. గత మోడల్స్‌తో పోలిస్తే డిజైన్, లైటింగ్ క్వాలిటీ పరంగా ఇందులో చాలా ప్రీమియం అప్‌గ్రేడ్స్ చేసింది. ఇందులో లుమిన్బ్లెండ్ టెక్నాలజీ పేరుతో సరికొత్త కలర్ మేనేజ్మెంట్ సాంకేతికతను ఉపయోగించారు. దీనివల్ల రంగులు చాలా సహజంగా, ఎక్కడా ప్యాచెస్ లేకుండా స్మూత్‌గా కనిపిస్తాయి. 1% బ్రైట్నెస్కి తగ్గించినా కూడా రంగుల క్వాలిటీ తగ్గకుండా స్థిరంగా ఉంటుంది. 2100 లుమెన్స్తో చాలా ఎక్కువ వెలుతురును ఇస్తుంది. పెద్ద లివింగ్ రూమ్‌ని సైతం ప్రకాశవంతంగా మార్చేస్తుంది. డబుల్ సైడెడ్ లైటింగ్ ఉండటం వల్ల.. గదిలో లైటింగ్ సమానంగా వ్యాపిస్తుంది. దీనివల్ల రూమ్ మొత్తం చాలా అందమైన ఆంబియెన్స్ ఏర్పడుతుంది. క్యాండిల్ లైట్ వెలుతురు నుంచి మిట్ట మధ్యాహ్నం ఎండలాంటి తెల్లటి వెలుతురు వరకు.. మీ మూడ్‌ని బట్టి లైటింగ్‌ని మార్చుకోవచ్చు. సమయం, వాతావరణం, సూర్యోదయ/సూర్యాస్తమయాలకు అనుగుణంగా ల్యాంప్ తన బ్రైట్నెస్, కలర్ టెంపరేచర్‌ను ఆటోమేటిక్‌గా మార్చుకుంటుంది. ఇక, మీ గదిలోని సౌండ్ సిస్టమ్‌లో వచ్చే పాటల బీట్‌కు అనుగుణంగా.. లైట్లు డ్యాన్స్ చేస్తాయి. ఇది అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, ఆపిల్ హోమ్, సామ్సంగ్ స్మార్ట్ థింగ్స్ లాంటి అన్ని స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్స్తో చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. మీరూ ఇంట్లో అద్భుతమైన లైటింగ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం చూస్తుంటే.. మార్కెట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్.
మరింత చిన్నగా..మరింత స్మార్ట్‌గా!

మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే ఆధునిక పరికరాల్లో స్మార్ట్ రింగులు ముందు వరుసలో ఉంటాయి. అయితే, మామూలు రింగులతో పోలిస్తే.. ఈ స్మార్ట్ రింగులు కాస్తా లావుగా ఉంటాయి. దాంతో, వాటిని ధరించినప్పుడు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ సమస్యకు.. Oura Ring 5 సమర్థంగా చెక్ పెడుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పల్చటి స్మార్ట్ రింగ్‌గా ఓరా సంస్థ అభివర్ణిస్తున్నది. మార్కెట్లో ఉన్న స్మార్ట్ రింగ్‌లతో పోలిస్తే.. ఇది 40 శాతం సన్నగా ఉంటుంది. దీని బరువు కేవలం 2 గ్రాముల నుంచే ప్రారంభమవుతుంది. ఇది లైట్‌వెయిట్, అలర్జీ ఫ్రీ టైటానియం బాడీతో తయారైంది. ఓరా రింగ్ 5 లోపలి వైపు చిన్నపాటి ‘సెన్సర్ డోమ్స్’ తీసుకొచ్చారు. ఇవి చర్మానికి మరింత దగ్గరగా ఆనుకుని ఉండి, చాలా కచ్చితమైన రీడింగ్స్ ఇస్తాయి. ఇందులో 12 సిగ్నల్ పాత్‌వేస్, శక్తిమంతమైన ఎల్ఈడీ సెన్సర్లు ఉన్నాయి. ఇవి విభిన్న చర్మ రంగులు, వేర్వేరు వేలి ఆకృతులు ఉన్నా.. హార్ట్ రేట్, స్లీప్ డేటాను కరెక్ట్‌గా ట్రాక్ చేస్తాయి. ఇందులోని హెల్త్ రాడార్.. బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం మీ బీపీని, రాత్రివేళ శ్వాసక్రియను పర్యవేక్షిస్తుంది. మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులను ముందే పసిగట్టి అలర్ట్ చేస్తుంది. మీరు రన్నింగ్, సైక్లింగ్, వర్కవుట్స్ చేసేటప్పుడు ఫోన్ యాప్ ద్వారా రియల్ టైమ్‌లో మీ వేగాన్ని, హార్ట్ రేట్‌ను చూడవచ్చు. ఇక జీఎల్పీ-1 మెడికేషన్ ట్రాకింగ్.. కొన్ని దేశాల్లో నేరుగా వైద్యులతోనే కనెక్ట్ అవుతుంది. ఈ రింగ్తోపాటే అల్యూమినియం వైర్లెస్ చార్జింగ్ కేస్ కూడా లభిస్తుంది. ఇది 100 మీటర్ల లోతు వరకు నీటిని తట్టుకోగలదు. కాబట్టి స్విమ్మింగ్, షవర్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఆదాచేసే ఆల్-ఇన్-వన్

ఈరోజుల్లో మల్టీ ఫంక్షనల్ గ్యాడ్జెట్స్‌కు ఆదరణ పెరుగుతున్నది. ఒకే పరికరం అనేక రకాలుగా ఉపయోగపడుతూ.. డబ్బును, స్థలాన్నీ ఆదా చేస్తున్నది. అలాంటి బ్లూటూత్ స్పీకర్ కావాలనుకుంటే.. Tempt Priv Fusion Premium 4-in-1 Smart Speaker Stationపై ఓ లుక్కేయండి. ఇది కేవలం ఒక బ్లూటూత్ స్పీకర్ మాత్రమే కాదు.. మీ బెడ్రూమ్, వర్క్ డెస్క్‌పై స్పేస్‌ను ఆదా చేస్తూ నాలుగు విభిన్న అవసరాలను తీర్చే ఒక ఆల్-ఇన్-వన్ డివైజ్ కూడా. ఇందులోని పవర్ఫుల్ బ్లూటూత్ స్పీకర్.. క్రిస్టల్ క్లియర్ సౌండ్, లౌడ్ బాస్‌ను అందిస్తుంది. దీని పైభాగంలో వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ ఉన్న ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లు, ఇయర్‌బడ్స్‌ను కేబుల్స్ లేకుండానే వేగంగా చార్జ్ చేసుకోవచ్చు. ఇదో స్మార్ట్ ఎల్ఈడీ అలారమ్ క్లాక్గానూ పనిచేస్తుంది. ఇందుకోసం దీని ముందు భాగంలో స్పష్టంగా కనిపించే ఎల్ఈడీ డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. ఇది మల్టీ-కలర్ ఆర్జీబీ లైటింగ్‌తో వస్తుంది. రాత్రి వేళల్లో ఇది ఒక అందమైన నైట్ లాంప్‌గా ఉపయోగపడుతుంది. వినే పాటల రిథమ్‌కు అనుగుణంగా లైటింగ్ మారే ఫీచర్ కూడా ఉంటుంది. ప్రీమియం బిల్డ్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్, స్లీక్ డిజైన్‌తో రావడం వల్ల.. ఇది ఇల్లు, ఆఫీస్ డెస్క్ డెకరేషన్‌కు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.