Food Challenge | ఒక్క పానీ పూరి తింటే 500 గెలుచుకునే ఛాన్స్!
Panipuri Challenge | గప్‌చుప్, పానీపూరీ, గోల్గప్పా.. పేరేదైనా నోరూరించే చిరుతిండి ఇది. ఘాటైన కూర, పుల్లపుల్లటి నీళ్లతో నింపిన చిట్టిపూరీలను వరుసపెట్టి లాగించేస్తారు చాలామంది. అయితే ‘బస్తీమే సవాల్. ఒక్క గప్‌చుప్ తింటే రూ.500 ఇస్తాను’ అంటూ సవాలు విసరుతున్నాడు
ఉత్తరప్రదేశ్‌లోని శిఖోహాబాద్కి చెందిన ఓ గప్చుప్వాలా. ఇంతకీ సవాలు ఏమిటంటే.. మామూలు గప్చుప్తో పోలిస్తే రెండింతలు ఉండే భారీ పూరీ నిండా కూర, మసాలా దట్టించి.. పుల్లటి పానీ నింపి అందిస్తాడు. ఆ పూరీని ఒక్కబుక్కలో తినేయాలి. ఒక్క చుక్క పానీ కూడా కిందపడకూడదు. అలా తినేస్తే మాత్రం, వెంటనే రూ.500 ఇచ్చేస్తాడు. తినలేకపోతేనేమో గప్‌చుప్ ఖరీదు రూ.100 కట్టాల్సిందే. చాలామందే ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. కానీ ఇప్పటివరకూ ఆరుగురే విజేతలుగా నిలిచి ‘పానీపూరి రత్న’ అందుకున్నారు. మీరూ ట్రై చేస్తారా?
Read More :
“సికింద్రాబాద్‌లో ఆటోమేటిక్ మెషిన్‌తో పానీపూరి సర్వ్..”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

