Food Challenge | ఐస్‌గోలా అనగానే చాలామందికి చిన్నతనంలో ఐస్బండి వెనకాల పరుగెత్తిన రోజులు గుర్తుకొస్తాయి. ఆ ఆలోచనతోనే నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి ఐస్గోలాతో ఓ వినూత్న చాలెంజ్‌ను ప్రారంభించాడు.
సవాలు ఏమిటంటే.. అడుగున్నర ఎత్తు తురిమిన ఐస్ముద్దమీద మలాయ్, కండెన్స్డ్ మిల్క్, ఆరెంజ్ సిరప్, పచ్చి మామిడి సిరప్, రబ్డీ వేసి పైనుంచి రాజ్‌భోగ్ ఐస్‌క్రీమ్ స్కూపులు పెట్టి అమెరికన్ చాక్లెట్స్, నట్స్‌తో నింపుతారు. ఈ మౌంట్ ఎవరెస్ట్ ఐస్గోలాను అరగంటలో ఆరగించేవారే విజేత. గెలిచినవారికి ఐదువేల రూపాయల బహుమానం. ఐస్‌క్రీమ్ డబ్బులు కూడా కట్టక్కర్లేదు. తినలేని వాళ్లు మాత్రం ఐస్‌క్రీం డబ్బులు చెల్లించాల్సిందే. ‘ఆర్ యూ హంగ్రీ’ యూట్యూబ్ చానల్ ఈ సవాలుకు వేదికైంది. మీరూ రంగంలోకి దూకండి. ఐస్ కోలా చాంప్ అయిపొండి.
“బాహుబలి సమోసా ఛాలెంజ్ : అరగంటలో తింటే రూ . 51,000 క్యాష్ ప్రైజ్!”