ఆటోతో జీవిత ప్రయాణం
జీవితం అంటే నిజంగా ఓ ప్రయాణమే. రోడ్డు మీదున్నట్టే జీవన యానంలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. మలుపులు, గతుకులు ఉంటాయి. కానీ ఇవేవీ రేఖ హుల్లూర్ను భయపెట్టలేదు. ఆమె కర్నాటక రాష్ట్రం గదగ్ పట్టణంలో తొలి మహిళా ఆటో డ్రైవర్. భర్త ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. తానేమో కూతురు, కొడుకును చూసుకుంటూ ఇంటికే పరిమితమైంది.
జీవితం అంటే నిజంగా ఓ ప్రయాణమే. రోడ్డు మీదున్నట్టే జీవన యానంలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. మలుపులు, గతుకులు ఉంటాయి. కానీ ఇవేవీ రేఖ హుల్లూర్ను భయపెట్టలేదు. ఆమె కర్నాటక రాష్ట్రం గదగ్ పట్టణంలో తొలి మహిళా ఆటో డ్రైవర్. భర్త ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. తానేమో కూతురు, కొడుకును చూసుకుంటూ ఇంటికే పరిమితమైంది. కానీ, జీవితం అన్నివేళలా సంతోషంగా సాగాలని ఏమీ లేదు. రేఖ విషయంలోనూ ఇది నిజమైంది. వాళ్ల కూతురుకు చిన్నవయసులోనే డయాబెటిస్ నిర్ధారణ అయ్యింది. హాస్పిటల్ ఖర్చులకు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంతలో రేఖ భర్త గుండెపోటుతో మరణించాడు. అలా రేఖకు జీవితంలోని చేదు అనుభవాలు ఒక్కసారిగా తెలిసివచ్చాయి. తాను బతకడానికే కాకుండా పిల్లల కోసం ఏదో ఒక పని చేయాల్సిన దుస్థితి వచ్చింది. పైగా కూతురి చికిత్స ఖర్చులు. ఇలాంటి అసహాయ స్థితిలో రేఖ దృష్టి ఇంటిముందున్న ఆటోపై పడింది. భర్త మరణంతో మూలనపడిన ఆటోను ఇకనుంచి తాను నడపాలని నిర్ణయించుకుంది. తనకు తెలిసినవారితో విషయం చెబితే ఆమెను ప్రోత్సహించారు. అలా రేఖ కేవలం పదిరోజుల్లోనే ఆటో నడపడంలో నైపుణ్యం సంపాదించింది. స్థానిక రోడ్డు రవాణా అధికారి (ఆర్టీఓ) కార్యాలయం నుంచి లైసెన్స్ పొందింది.
మొదటిరోజు ఆటోతో రోడ్డుపైకి వెళ్లగానే అక్కడున్న ఆటో డ్రైవర్లు ఆమెను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. కొంతమంది ఆమెకు అండగా నిలిచారు. అయితే ప్రయాణికులు మాత్రం ఆమె నడపగలదా అని సంశయించారు. అప్పుడు “నేను ఈ ఆటోరిక్షా యజమానిని. మిమ్మల్ని మీ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుస్తాను” అని రేఖ ధైర్యం నూరిపోసింది. వాళ్లు కూడా ఆ మాటలను విశ్వసించారు. అలా గదగ్ రోడ్లపై తొలి మహిళా ఆటో డ్రైవర్‌గా రేఖ ప్రయాణం మొదలైంది. ఇంతలో రేఖ బంధువులు ‘ఆటో నడపడం అనుకున్నంత సులువైన వ్యవహారం కాద’ని హెచ్చరించారు. వాళ్లన్నట్టే అప్పుడప్పుడు ఆటో ప్రయాణికులతో ఆమెకు ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురయ్యాయి.
అయినప్పటికీ రేఖ బెదిరిపోలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటానని సంకల్పించుకున్నది. ఇప్పుడు గదగ్‌లో రేఖ చాలామందికి పరిచయస్తురాలు. వారు ఆమెను చాలా గౌరవంగా ఆదరిస్తున్నారు. ప్రయాణికులతో రేఖ ఎంతో మర్యాదగా, సున్నితంగా వ్యవహరిస్తారు. “ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కాబట్టి మా ఆటోస్టాండ్‌లో మహిళా డ్రైవర్ ఉండటం మాకు సంతోషాన్ని ఇస్తున్నది” అంటారు ఓ ఆటో డ్రైవర్. తన కుటుంబ పోషణ కోసం ఆటోరిక్షా నడుపుతున్న రేఖ ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేరవేస్తూ ఎంతో ఆదరాన్ని పొందుతున్నది. కూతురు డయాబెటిస్ వ్యాధికి చికిత్స చేయించగలుగుతున్నది. ఎంతటి కారుచీకటి అలుముకున్నా సూర్యుడు ఉదయించడం తప్పనిసరి!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

