సమ న్యాయం
స్వరాష్ట్రంలో సొంత ప్రభుత్వం 2019లో తీసుకువచ్చిన కొత్త జోనల్ వ్యవస్థ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు సమన్యాయాన్ని కల్పించింది. జిల్లాల పునర్విభజన జరగడం, కొత్త జోనల్ సిస్టమ్ అమలులోకి రావడంతో ఉమ్మడి జిల్లాల పరిధిలో న్యాయమైన ఫలాలు దక్కని వారికి ఊరట కలిగింది.
జిల్లాల పునర్విభజనతో అన్ని పక్షాలకూ సమన్యాయం జరిగింది. అందుకు వెంకటేశ్ కథే ఉదాహరణ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్ మండలంలోని అటవీప్రాంతం అతనిది. పూర్తిగా వెనుకబడిన ఈ ప్రాంతానికి ఒకప్పుడు బస్సు కూడా లేదు. పాఠశాల, ఆసుపత్రి ఇతర ఏ సాంకేతిక సౌకర్యాలు అసలే లేవు. అయినా వెంకటేశ్ కష్టపడి చదువుకొని డిగ్రీ పూర్తి చేశాడు. 2015లో కరీంనగర్ జిల్లా పరిధిలో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిపై భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండటంతో వెంకటేశ్ దరఖాస్తు చేసుకొని కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఇంటర్వ్యూకు హాజరయ్యాడు.
ఇంటర్వ్యూ నిర్వహించే కార్యాలయానికి చేరిన వెంకటేశ్ అక్కడ ఉన్న జనాలను చూసి ఆశ్చర్యపోయాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఉండి అన్ని సౌకర్యాలతో చదువుకున్న వ్యక్తులు పదుల సంఖ్యలో అక్కడ కనిపించారు. వారందరికి తన కంటే ఎక్కువ మార్కులు కనిపించాయి. మారుమూల అటవీ ప్రాంతానికి చెందిన తాను వారితో పోటి పడలేనన్న భావం వెంకటేశ్‌లో కలిగింది. చివరికి అతనికి ఆ ఉద్యోగ అవకాశమే లభించలేదు. ఒక్క జిల్లాకు చెందిన వాళ్లమే అయినా, వారు అన్ని సౌకర్యాలతో చదువును అభ్యసించారని, అలాంటి వారితో తాను పోటిపడటం ఎలా సాధ్యం అన్న భావనతో తీవ్ర నిరాశకు గురయ్యాడు వెంకటేశ్.

Samanyayam
మూడేండ్లు గడిచాయి. జిల్లాల పునర్విభజన జరిగింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. వెంకటేశ్ మరోసారి ధరఖాస్తు చేసుకొని జగిత్యాల జిల్లా ఆఫీస్‌కు చేరుకున్నాడు. లోకల్ (జిల్లా క్యాడర్‌కు) సంబంధించిన పోస్టు కావడంతో (95 శాతం స్థానిక జిల్లా వాసులకే కేటాయించారు) పెద్దగా పోటీ కనిపించలేదు. వెంకటేశ్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అప్పుడు వెంకటేశ్‌కు అర్థమైంది…జిల్లా పునర్విభజన వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు ఎలా సమన్యాయం జరుగుతుందన్న విషయం.
ఇది ఒక్క వెంకటేశ్‌కు ఎదురైన అనుభవమే కాదు. లోకల్ క్యాడర్లో ఉద్యోగాలు పొందిన పలువురికి కలిగిన అనుభవం. స్వరాష్ట్రంలో సొంత ప్రభుత్వం 2019లో తీసుకువచ్చిన కొత్త జోనల్ వ్యవస్థ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు సమన్యాయాన్ని కల్పించేందుకు మార్గాన్ని సుగమం చేసింది. జిల్లాల పునర్విభజన జరగడం, కొత్త జోనల్ సిస్టమ్ అమలులోకి రావడంతో ఉమ్మడి జిల్లాల పరిధిలో న్యాయమైన ఫలాలు దక్కని వారికి ఊరట కలిగింది. అలాగే ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు సైతం స్థానికులకు అధికంగా లభించడం మొదలైంది.
తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల క్రితం మొదలైన 33 జిల్లాల ప్రగతి ప్రస్థానం.. నిత్యం పురోగమిస్తూనే ఉంది. భారత యవనికపై తన విజయ గీతికలను వినిపిస్తూనే ఉంది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

