గుండెకు గాయం… ఇక మాయం!

హృద్రోగం… కోట్లాది జీవితాలను నరకంగా మార్చిన మహమ్మారి. సమస్య తీవ్రమై గుండెలో కొంతభాగం దెబ్బతిన్నప్పుడు, వారికి ఇతరుల గుండెను అమర్చడమో, యంత్రాల ద్వారా రక్త ప్రసరణ కొనసాగించడమో చేస్తారు. ఈ రెండు పద్ధతులూ ఖరీదైనవి, సంక్లిష్టమైనవి. పోనీ దెబ్బతిన్న గుండెను సరిచేద్దామా అంటే, ఇప్పటివరకూ అది అసాధ్యంగా ఉండేది. ఎందుకంటే గుండెలో కొంతభాగం దెబ్బతిన్నాక, దాన్ని తిరిగి బాగుచేయడం కుదిరేది కాదు. ఓ గాయంలా శాశ్వతంగా ఉండిపోయేది. గతంలోనే, చిన్నచిన్న జంతువుల్లో దెబ్బతిన్న శరీరభాగాలు తిరిగి పనిచేసేలా.. ఆయా కణాలను ప్రభావితం చేయగలిగారు. కానీ మనుషుల మీద ఈ తరహా ప్రయోగాలు ఫలించలేదు. ఇప్పుడా సమస్య తీరిపోయింది. టెక్సాస్‌కు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిపుణులు ఈ ఘనత సాధించారు. మన రక్తనాళాల్లో ఉండే ‘ఎండోథీలియల్’ కణాలు తమ సూచనలకు స్పందిస్తున్నాయని గ్రహించి, వాటి ద్వారా గుండె కండరాలను సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా… భవిష్యత్తులో ఈ ప్రక్రియ ద్వారా గుండెవ్యాధులను సరిదిద్దవచ్చని చెబుతున్నారు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

