Telepathy | మీ పెట్ డాగ్స్ మనసులో ఏముందో ఇలా తెలుసుకోవచ్చంట!!
Dog Telepathy | పెంపుడు జంతువుతో మనిషి అనుబంధం ప్రత్యేకమైంది. కొన్నిసార్లు, పెంచి పెద్దచేసిన యజమానులు సైతం వాటి మనసును అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అరుస్తున్నాయో, ఎందుకు మూలుగుతున్నాయో తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి సమయంలోనే ఓ ఎక్స్పర్ట్ అవసరం ఉంటుంది. ఇక్కడే, టెలీపతి నిపుణులు కమ్ పెట్ కమ్యూనికేటర్స్ రంగంలోకి దిగుతున్నారు.

ఆమూగ జీవాలు ఒక్కోసారి అలిగినట్లు కనిపిస్తాయి. ఒక్కోసారి మంచి జోష్ మీద ఉంటాయి. క్షణక్షణానికి వాటి ఉద్వేగాలు మారిపోతుంటాయి. వాటి మనసులో ఏముందో తెలుసుకోగలిగితే సగం సమస్య పరిష్కారం అవుతుంది. కానీ, కమ్యూనికేషన్ అతితీవ్ర అవరోధం. ఎదుటి మనిషి మనసునే చదవలేం! ఇక జంతువుల మనసుల్ని ఎలా తెలుసుకోగలం! దీంతో చాలామంది ‘టెలీపతి’ని ఆశ్రయిస్తున్నారు.

బంధం బలపడుతుంది
టోక్యోలోని షిబుయా రైల్వేస్టేషన్. హచికో అనే కుక్క రోజూ యజమానిని స్టేషన్ దగ్గర సాగనంపేది. సాయంత్రం అతను వచ్చేదాక ఎదురుచూస్తూ ఉండేది. ఒకరోజు డ్యూటీకి వెళ్లిన యజమాని తిరిగి రాలేదు. మెదడులో రక్తస్రావం జరిగి చనిపోయాడు. విషయం తెలియక తొమ్మిదేండ్ల పాటు అక్కడే ఎదురు చూసీచూసీ మరణించింది హచికో. ఆ విషయం తెలియక, దాని కష్టాన్ని గ్రహించలేక చాలామంది ఆ శునకాన్ని పిచ్చికుక్క కింద జమకట్టారు. టెలీపతి ద్వారా మనసును చదివాకే యజమాని పట్ల దాని ప్రేమ ఏపాటిదో తెలిసింది. దీంతో హచికో జ్ఞాపకార్థం షిబుయా స్టేషన్లో కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. ఇలాంటిదే మరో సంఘటన కూడా ఉంది.. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు జరుపుతున్నది. ఎప్పుడు బాంబు పడుతుందో తెలియక ఉక్రెయిన్ జనాలు ఆందోళన చెందుతున్నారు. రాజధాని కీవ్ ప్రాంతంలో రష్యా దళాల చేతిలో ఒక వ్యక్తి మరణించాడు. అయితే అతని పెంపుడు కుక్క అతణ్ని వదిలి వెళ్లేందుకు నిరాకరించింది. దీనంగా శవం పక్కనే కూర్చొని అందరి గుండెల్నీ కదిలించింది. దానికి సాంత్వన చేకూర్చడానికి సైనికాధికారులు డాగ్ కమ్యూనికేటర్ల సాయం తీసుకున్నారు. మీ కుటుంబంలో జరిగే పరిణామాలు, మీ వ్యక్తిగత జీవితంలోని ఎగుడు దిగుళ్లు కూడా మీ శునకం మీద ప్రభావం చూపుతూ ఉండవచ్చు. మీ పెంపుడు జంతువు ఏం ఆలోచిస్తుందన్నది టెలీపతి ద్వారా తెలుసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. దీనివల్ల యజమానికి, పెంపుడు జంతువులకు మధ్య అనుబంధం బలపడుతుంది.

మనసు మాట వినొచ్చు
అభినవ్ కిషన్ డాగ్ ట్రైనర్. రొటీన్ లైఫ్‌తో విసుగు చెంది కొద్దిరోజుల పాటు గడపడానికి డెహ్రాడూన్ సమీపంలోని బర్వాలా అనే గ్రామానికి వెళ్లాడు. తనతో పాటు పెంపుడు జంతువు మియాను కూడా తీసుకెళ్లాడు. కొద్దిరోజులు గడిచాయి. కొత్త ప్రదేశం కావడంతో ఒకరోజు మియా తప్పిపోయింది. అభినవ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మూడు నెలలు గడిచిపోయాయి. పోలీసులను కూడా ఆశ్రయించాడు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. టెలీపతి నిపుణులు, యానిమల్ కమ్యూనికేటర్ ఆశా అరుణ్ ద్వారా మియా ఆనవాళ్లు తెలుసుకోగలిగారు. గురుగ్రావ్‌కు చెందిన ఆశ టెలీపతి సాధకురాలు. అభినవ్ తన పెంపుడు కుక్క పేరు, ఎక్కడ తప్పిపోయింది? ఎన్ని గంటలకు తప్పిపోయింది? తదితర వివరాలన్నీ చెప్పాడు. ‘టెలీపతి’ ద్వారా మియా గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది ఆశ. దాదాపు 15 రోజుల పాటు మియాతో మాట్లాడినట్లు ఆమె వెల్లడించింది. దీంతో, టెలీపతి పద్ధతిలోనే తన ఆచూకీ ఇవ్వడం మొదలుపెట్టింది మియా. అభినవ్ నివాసానికి 30 కిలోమీటర్ల దూరంలోని ఒక వంతెన దగ్గర మియా ఉన్నట్టు తేలింది. ఆ ఆనవాళ్ల ప్రకారమే తన పెంపుడు కుక్క దగ్గరికి వెళ్లాడు. ఆశ ఇలాంటి కేసులు చాలానే పరిష్కరించింది.

ఏమిటీ టెలీపతి?
టెలీపతిని ‘భావ ప్రసరణ శక్తి’ అంటారు. మాట, చూపు, సైగలు.. లేకుండానే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సమాచారాన్ని చేరవేయడం అన్నమాట. పరమహంస యోగానంద రచించిన ‘ఒక యోగి ఆత్మకథ’లోనూ టెలీపతికి సంబంధించి అనేక ఉదాహరణలు ఉన్నాయి. టెలిఫోన్లు, సెల్ఫోన్లు లేనికాలంలోనే హిమాలయ యోగులు యోజనాల దూరంలోని తోటి సాధువులతో ఈ పద్ధతిలోనే సమాచారం ఇచ్చిపుచ్చుకునేవారని యోగానంద తన ఆత్మ కథలో రాసుకున్నారు. అదే టెక్నిక్‌ను ఇప్పుడు జంతువుల మనసులోని భావాలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారంతే. ఇదోరకమైన ‘థాట్ ట్రాన్స్ఫర్’ అన్నమాట. మనుషులతో పోలిస్తే.. పెంపుడు జంతువులలోనే భావ ప్రసరణ శక్తి ఎక్కువని అంటారు. పెట్ ఎక్కడుందో, మనసులో ఏం అనుకుంటుందో తెలుసుకోవడానికి కమ్యూనికేటర్స్ ఆ జంతువు చిత్రాలను మాధ్యమంగా ఉపయోగిస్తారు. సెల్ఫోన్లో శబ్ద తరంగాల సాయంతో సమాచారం చేరుతుంది, టెలీపతిలో ధ్యాన తరంగాల రూపంలో సాధకుడు పెంపుడు జంతువు మనసులోకి ప్రవేశిస్తాడని చెబుతారు.
Read More :
Pet Photography | నయా ట్రెండ్.. శునకాలకు కూడా డిఫరెంట్ ఫొటోషూట్”
Dogtrin of Peace| కుక్కతో సావాసం.. మనసుకు ఉల్లాసం..”
“మనుషులే కాదు శునకాలు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నాయి.. రీజనేంటో మరి !!”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- pet dogs
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

