నయా మాల్
ఓటీటీలు వచ్చాక ఇల్లు థియేటర్ అయిపోయింది. టీవీ వెండితెరగా మారి పోయింది. ఇక సినిమాలు, సిరీస్‌లు చూసేటప్పుడు మల్టీప్లెక్స్ అనుభూతి కోసం సౌండ్ బార్లు, హోమ్ థియేటర్లు వాడున్నాం.
- ధూమ్‌ధామ్.. హోమ్ థియేటర్
ఓటీటీలు వచ్చాక ఇల్లు థియేటర్ అయిపోయింది. టీవీ వెండితెరగా మారి పోయింది. ఇక సినిమాలు, సిరీస్‌లు చూసేటప్పుడు మల్టీప్లెక్స్ అనుభూతి కోసం సౌండ్ బార్లు, హోమ్ థియేటర్లు వాడున్నాం. అయితే వీటన్నిటి కోసం ఇంట్లో ఓ మూలన ప్రత్యేక ఏర్పాటు, వాటి చుట్టూ తీగలు ఉంటాయి. కానీ క్యాన్వాస్ హైఫై టీవీ బ్రాకెట్ కనుక ఉంటే వీటి అవసరమే లేదు.
టీవీ స్టాండ్‌లా పనికొచ్చే ఈ పరికరం అచ్చంగా హోమ్ థియేటర్ ఎఫెక్ట్ ఇస్తుంది. పలచగా ఒక ఫ్రేమ్‌లా ఉండే దీని లోపల.. హై ఎండ్ స్పీకర్లు, ట్వీటర్లు, ఊఫర్లు, పాసివ్ రేడియేటర్లు, హైఫై యాంప్లిఫయర్లు, డీఏసీలు ఉంటాయి. వివిధ రకాల టీవీలకు సరిపోయేలా రకరకాల సైజుల్లో ఇవి తయారవుతున్నాయి. రంగులూ, డిజైన్లనూ ఎంచుకోవచ్చు. వీటిని canvashifi.com ద్వారా కొనుగోలు చేయొచ్చు. ధర రూ. 2.71 లక్షలు.
చిత్రాల బైనాక్యులర్

నయాటెక్నాలజీతో బైనాక్యులర్లు కూడా అప్డేట్అయిపోయాయి. వీటిలోనూ ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చొరబడింది. ఆ తరహావేస్వరోవ్స్కీ ఆప్టిక్ బైనాక్యులర్స్. దీంతో మనం చూడాలనుకున్న దృశ్యాన్ని, వస్తువును మరింత స్పష్టంగా చూడగలం. పదిరెట్లు జూమ్ చేసే అవకాశమూ ఉంది. ఒక్క బటన్ నొక్కితే చాలు అల్లంతదూరాన ఉన్న పక్షులు, జంతువుల్ని సైతం స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు, ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసుకునే వీలు కూడా ఉంది. స్టోరేజీ ఆప్షన్‌తో పాటు షేర్ చేసుకునే వెసులుబాటూ ఇచ్చారు. ప్రత్యేక యాప్ సాయంతో దీన్ని ఉపయోగించవచ్చు. ధర. 3.98 లక్షలు. swarovskioptik.com ద్వారా కొనుగోలు చేయొచ్చు.
ఇంట్లోనే చర్మ చికిత్స

గతంలో సెలెబ్రిటీలకు మాత్రమే పరిమితమైన చర్మ చికిత్సలు ఇప్పుడు మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలకు కూడా దగ్గర అవుతున్నాయి. వీటిని జనానికి మరింత చేరువ చేసేలా పీఎండీ – పర్సనల్ మైక్రో డెర్మ్ అనే పరికరం మార్కెట్లోకి వచ్చింది. ఇది చర్మం పై పొరల్లోని మృత కణాలను తొలగించి యవ్వనవంతమైన, కాంతిమంతమైన చర్మాన్ని ఇస్తుంది. క్రమం తప్పకుండా వాడటం వల్ల మచ్చలు, ముడతలు పోయి శరీరమంతా సమమైన ఛాయ సొంతం అవుతుందని చెబుతున్నది తయారీ సంస్థ. అవసరాన్ని బట్టి వాడుకునేలా విభిన్న కెపాసిటీలతో లభిస్తున్న ఈ పరికరాలు ప్రొఫెషనల్ స్కిన్ ట్రీట్మెంట్తో సమానమైన ఫలితాలను ఇస్తాయనీ అంటున్నది. pmdbeauty.com ద్వారా విక్రయిస్తున్నారు. ధర 13 వేలు.
కాలం పరుగు చూద్దాం!

గడియారం రోజూ వాడే వస్తువే అయినా, అందులో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చొప్పిస్తూ ైస్టెల్ స్టేట్మెంట్గా మారుస్తున్నారు డిజైనర్లు. కాలంతోపాటు వైవిధ్యాన్ని జోడిస్తూ వాచీల తయారీలో తమదైన ముద్ర వేస్తున్నాయి వివిధ కంపెనీలు. ఇక్కడి చిత్రంలో ఆకుపచ్చ డయల్‌తో చూడగానే కాంటెంపరరీ లుక్‌లో కనిపిస్తున్నది ‘కెన్నెత్ కోల్ న్యూయార్క్’ సంస్థ రూపొందించిన ఆటోమేటిక్ వాచ్. ముళ్లతోపాటు లోపలి మెకానిజం మొత్తం కనిపించడం ఇందులోని ప్రత్యేకత. డయల్ వెనక ఉండే ఆకుపచ్చ గ్లాస్ పారదర్శకంగా ఉండటంతో వాచీ ఎలా నడుస్తున్నదీ ప్రత్యక్షంగా చూడొచ్చు. మనం కదిలినప్పుడు వచ్చే శక్తిని వినియోగించుకుని ఈ వాచీ పనిచేస్తుంది. titan.co.inలో ఆర్డర్ చేయవచ్చు. ధర రూ.21,595.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

