Spoofing | మోసగాళ్లకు అయాచిత వరాలుగా మారుతున్న మన అజ్ఞానం, దురాశ..!
మన అజ్ఞానం, దురాశ, మొహమాటం, ఆత్మన్యూనత మోసగాళ్లకు అయాచిత వరాలుగా మారుతున్నాయి. స్పూఫింగ్‌కు ఉసిగొల్పుతున్నాయి. మన వ్యక్తిగత జీవితాలపై, విలువైన సమాచారంపై జరిగే దాడే స్పూఫింగ్. ఫలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెబుతారు.
మనల్ని నమ్మించడానికి, మన సిస్టమ్‌లో జొరబడటానికి, మాల్వేర్ జొప్పించడానికి, డేటా దొంగిలించడానికి, సొత్తు కాజేయడానికి.. జరిగే సైబర్ కుట్రే.. స్పూఫింగ్. ఆ చొరబాటు ఏ రూపంలో అయినా ఉండొచ్చు. ఈమెయిల్ స్పూఫింగ్, వెబ్సైట్ లేదా యూఆర్ఎల్ స్పూఫింగ్, కాలర్ ఐడీ స్పూఫింగ్.. ఏ మార్గంలో అయినా ఆపద చుట్టుముట్టొచ్చు.
Spoofing | మన అజ్ఞానం, దురాశ, మొహమాటం, ఆత్మన్యూనత మోసగాళ్లకు అయాచిత వరాలుగా మారుతున్నాయి. స్పూఫింగ్‌కు ఉసిగొల్పుతున్నాయి. మన వ్యక్తిగత జీవితాలపై, విలువైన సమాచారంపై జరిగే దాడే స్పూఫింగ్. ఫలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెబుతారు. అదేదో బీమా సంస్థ ప్రతినిధులమంటూ నమ్మిస్తారు. లాటరీ తగిలిందని మభ్యపెడతారు. కబుర్లతో బోల్తా కొట్టించి.. క్రెడిట్‌కార్డు నంబరు, ఓటీపీ, లాగిన్ వివరాలు లాగేసుకుంటారు. నిజానికి, మనం నోరు విప్పకపోతే వాళ్ల ఆటలు చెల్లవు. మనం ప్రశ్నించడం ప్రారంభిస్తే.. వాళ్లే తోక ముడుచుకుని పారిపోతారు.
ఈమెయిల్ స్పూఫింగ్ హఠాత్తుగా మన ఇన్‌బాక్స్‌లో ఏదో మెయిల్ ప్రత్యక్షం అవుతుంది. మీ ఆధార్ వివరాలు సరిచూడాలనో, మీకు ఆదాయపన్ను శాఖ నుంచి పెద్ద మొత్తంలో రీఫండ్ ఉందనో, మీ డెబిట్‌కార్డు లేదా క్రెడిట్‌కార్డు గణాంకాలు సరిచూడాలనో.. ఆ మెయిల్ సారాంశం. గుడ్డిగా నమ్మితే గోతిలో పడినట్టే. నిజానికి ఆ లేఖే ఓ తప్పుల తడక. లెక్కలేనన్ని అక్షరదోషాలు. ప్రతి పదంలోనూ వ్యాకరణ అపశ్రుతులే. తక్షణం స్పందించకపోతే.. కొంపలు మునిగిపోతాయేమో అన్నంత తొందరపెడతారు. మనల్ని భయపెడతారు. ఆలోచించుకునే అవకాశమూ ఇవ్వరు. పేరుకు ప్రధాన కంపెనీల నుంచి వచ్చినట్టు కనిపిస్తున్నా.. జాగ్రత్తగా గమనిస్తే, మధ్యలో ఒకటో రెండో అదనపు అక్షరాల్ని జోడించినట్టు అర్థమైపోతుంది. లేదంటే ఆ పేరు ప్రసిద్ధ బ్రాండ్స్‌కు అనుకరణ అయినా కావచ్చు. ZIP లేదా .exe ఫైల్స్ లాంటి అనుమానాస్పద అటాచ్మెంట్స్ ఉన్నా సందేహించాల్సిందే. వాటి రూపంలో మాల్వేర్ను పంపించి ఉండొచ్చు. ఏ లింక్‌ను పడితే ఆ లింక్‌ను క్లిక్ చేయడమూ ప్రమాదకరమే. పేరున్న సంస్థలను పోలిన.. ఫేక్ వెబ్సైట్లను బ్రౌజ్ చేయడం కూడా కోరికోరి కొరివితో తల గోక్కోవడమే.
ఐపీ స్పూఫింగ్
కంపెనీలు, ఆర్థిక సంస్థలు, వ్యాపార పరివారాలు లక్ష్యంగా ఈ దాడి జరుగుతుంది. ఐపీ అడ్రస్‌ను దాచేస్తూ.. తమ మూలాల్ని మరుగుపరుస్తూ దాడికి తెగబడతారు. ఫేక్ అడ్రస్‌తో కుప్పలు తెప్పల ట్రాఫిక్‌ను మన సర్వర్ వైపు మళ్లిస్తారు. దీంతో నెట్వర్క్ మొరాయిస్తుంది. కస్టమర్లు ఆన్లైన్లో లావాదేవీలు నిర్వహించుకోవడం అసాధ్యం అవుతుంది. కొన్నిసార్లు పని జరిగినా, మందకొడిగా సాగవచ్చు. దీంతో ఆ సంస్థ పట్ల జనంలో నమ్మకం సన్నగిల్లుతుంది. కుట్రదారుల లక్ష్యమూ అదే. ఆ ప్రమాదాన్ని తొలిదశలోనే పసిగడితే సమర్థంగా ఎదుర్కోవచ్చు. అకారణంగా జరిగే సర్వర్ క్రాషెస్‌ను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు.
కాలర్ ఐడీ స్పూఫింగ్
పొద్దున్నే ఆఫీసుకు బయల్దేరుతుంటే ఫోన్ మోగుతుంది. ‘ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్’ అంటూ ట్రూకాలర్‌లో కనిపిస్తుంది. సాక్షాత్తు ఐటీ అధికారులు కాల్ చేయడంతో తడబడిపోతాం. అవతలి వ్యక్తి కూడా మన మనసు ఎరిగినట్టు, మహాదర్జాగా మాట్లాడతాడు. ‘మీకు లక్ష రూపాయల రీఫండ్ ఉంది. మీ బ్యాంక్ వివరాలు సరిగాలేవు. ఫోన్లో చెప్పేస్తే.. సాయంత్రానికంతా అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది’ అని చెబుతాడు. అనుమానించడానికి ఏమీ లేదనిపిస్తుంది. మన బ్యాంకు ఖాతాలోని సొమ్మంతా ఖాళీ అయిన తర్వాతే.. జరిగిన మోసం అర్థం అవుతుంది. ఇలాంటి వ్యవహారాలన్నీ కాలర్ ఐడీ స్పూఫింగ్ కోవలోకి వస్తాయి. ప్రతిసారీ ట్రూకాలర్లాంటి యాప్స్‌ను నమ్మడం సరికాదు. ఏ ఆర్థిక సంస్థా కీలక సమాచారాన్ని ఇవ్వమని ఫోన్లో ఒత్తిడి చేయదు. అనుమానం వస్తే.. కాల్ కట్‌చేసి మళ్లీ.. మనమే చేయాలి. వేళకాని వేళలో ఫోన్ వచ్చినా, విచిత్రమైన అంకెలతో ప్రత్యక్షమైనా మోసపూరిత వ్యవహారమే అని గ్రహించాలి. ఫోన్‌కాల్ నాణ్యతలో తేడాలు, మధ్యమధ్యలో వినిపించే వింత శబ్దాలు కూడా ప్రమాద సంకేతాలే.
నిరోధించడం ఇలా..
- అనుమానాస్పద ఈమెయిల్స్, ఎస్ఎమ్ ఎస్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- ఒకటికి రెండుసార్లు రూఢి చేసుకున్న తర్వాతే క్లిక్ చేయాలి.
- చాలావరకు మోసపూరిత సైట్స్ ఆటోఫిల్ లాగిన్ క్రెడిన్షియల్స్‌ను ఉపయోగించవు.
- అక్షర దోషాలు, వ్యాకరణ లోపాలు, కృతకమైన డిజైన్లు, అతకని కలర్ కాంబినేషన్లు ఎక్కువగా ఉంటాయి.
- బ్రౌజర్ అడ్రస్ బార్లో తాళం చిహ్నం కనిపించకపోయినా, అడ్రస్ బార్ మీద క్లిక్ చేసినప్పుడు.. https://కి బదులుగా http://తో మొదలైనా సందేహించాల్సిందే.
- ఇ-మెయిల్, సోషల్ మీడియా సైట్స్ కోసం ‘టూ ఫాక్టర్ ఆథెంటికేషన్’ ఎంచుకోవడం సురక్షితం.
- చాలామంది పాస్వర్డ్ విషయంలో ఘోరంగా ఫెయిల్ అవుతుంటారు. మనం ఎంచుకునే పాస్వర్డ్ అనేది సామాన్య అక్షరాలు, పెద్దక్షరాలు, అంకెలు, సంకేతాల సమాహారమై ఉండాలి. ఎవరికీ ఊహించుకునే అవకాశం ఇవ్వకూడదు.
వివరాలను నమోదు చేసేముందు యూఆర్ఎల్ను జాగ్రత్తగా గమనించండి. - ఉదాహరణకు.. https://www.amazon.com బదులు https://www.amazonn.com లేదా https://www.arnazon.com
ఉండవచ్చు.
-అనిల్ రాచమల్లవ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

