1 ఆఫ్రికా ఖండ దేశమైన మలావీలో విమానం కుప్పకూలడంతో ఆ దేశ ఉపాధ్యక్షుడు దుర్మరణం పాలయ్యారు. ఆయన పేరేంటి?
2 అంతరిక్షంలో వెయ్యి రోజులు గడిపిన తొలి వ్యోమగామిగా రష్యా దేశానికి చెందిన కాస్మోనాట్ ఒకరు రికార్డు సాధించారు. ఆయన ఎవరు?
3 భారతీయ నావికా దళంలో తొలి మహిళా హెలికాప్టర్ పైలట్‌గా ఓ సైనిక అధికారి నియమితులు అయ్యారు.ఆమె పేరేంటి?
4 దాదాపు 500 ఏండ్లనాటి ఓ కంచు విగ్రహాన్ని ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం భారతదేశానికి తిరిగి అప్పగించడానికి
అంగీకరించింది. ఆ విగ్రహం ఎవరిది?
5 నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898ఏడీ’ చిత్రం భారీ అంచనాలతో రూపొందుతున్నది. ఈ చిత్రంలో ప్రముఖ హీరో అమితాబ్ బచ్చన్ కూడా ఓ పాత్ర పోషిస్తున్నాడు. అది ఏది?
6 ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ టెన్సిస్ పోటీల్లో ఓ కొత్త కెరటం విజేతగా నిలిచాడు. టోర్నీ ఫైనల్లో జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి కప్ గెలుచుకున్న ఆ స్పెయిన్ యువతార ఎవరు?
7 భారతదేశంలో నిద్రాణంగా ఉన్న ఏకైక అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ దీవుల్లోని బారెన్. ఓ పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ఈ పర్వతంపైకి అడుగుపెట్టి కరీంనగర్‌కు చెందిన మహిళ ఒకరు వార్తల్లో నిలిచారు. ఆమె ఎవరు?
8 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో
భారతదేశానికి చెందిన నక్టి, నాగి పక్షి సంరక్షణ కేంద్రాలకు రామ్సర్ స్థలాల హోదా ప్రకటించింది. ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
9 లూయిస్విల్లేలో జరిగిన అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లో బౌట్ గెలిచిన తొలి భారతీయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ ఎవరు?
10 ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (జనరల్ అసెంబ్లీ) సమావేశాలకు ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు?
1. సౌలోస్ క్లాస్ చిలిమా
2. ఒలెగ్ కొనొనెంకో
3. సబ్ లెఫ్టినెంట్ అనామిక బి.రాజీవ్
4. పన్నెండు మంది ఆళ్వారులలో ఒకరైన తిరుమంగై ఆళ్వారుది.
5. మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర
6. కార్లోస్ అల్కరాజ్
7. మహమ్మద్ పర్వీన్ సుల్తానా
8. బిహార్
9. పూజా తోమర్
10. కామెరూన్ దేశ మాజీప్రధాని ఫిలెమోన్ యాంగ్