నీలాకాశపు అందాలు.. తేలిపోయే మేఘాలు.. ఆ మబ్బుల్లోంచి మసకమసకగా కనిపించే సూర్యోదయ కిరణాలు.. వీటిని కెమెరాలో బంధించడం అద్భుతమే అవుతుంది. ఆ అద్భుతానికే.. క్లౌడ్స్కేప్ ఫొటోగ్రఫీ అని పేరు. ఇది.. ఆకాశంలో మేఘాల అందాన్ని చిత్రీకరించే కళ. చేతిలో ఉన్న మొబైల్ కెమెరా సహాయంతో.. ఆకాశంలోని అద్భుతమైన మేఘాల దృశ్యాలను క్యాప్చర్ చేయవచ్చు. మేఘాల రూపాలను, సరైన కాంతి, మొబైల్ కెమెరా సెట్టింగ్స్, కంపోజిషన్ టెక్నిక్స్తోపాటు ఎడిటింగ్ టిప్స్ కూడా తెలుసుకుందాం.
ఆకాశంలో తేలిపోయే వివిధ రకాల మేఘాలను, వాటి ఆకృతులను, రంగులతోపాటు కాంతితో కలిసి అవి సృష్టించే అందమైన దృశ్యాలను ఫొటోల రూపంలో బంధించడమే.. క్లౌడ్స్కేప్ ఫొటోగ్రఫీ. వానకాలం, ఎండకాలం.. ఉదయం, సాయంత్రం ఇలా కాలం, సమయాన్ని బట్టి మేఘాలు విభిన్న రీతుల్లో కనిపిస్తాయి. ఫొటోగ్రఫీకి అనువైన అవకాశాన్ని కల్పిస్తాయి.
మేఘాలను అందంగా ఫొటో తీయాలంటే.. అందుకు సరైన సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
మేఘాలను ఫొటో తీయాలంటే.. కెమెరాలో కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ చేసుకోవాలి.
ఫొటోలు తీయడం మాత్రమేకాదు, వాటిని ఎడిట్ చేయడం కూడా ముఖ్యమే. కింద పేర్కొన్న కొన్ని యాప్స్.. మీ ఫొటోలని మరింత మెరుగుపరుస్తాయి.
చివరిగా.. క్లౌడ్స్కేప్ ఫొటోగ్రఫీ మీ క్రియేటివిటీని మెరుగుపరుస్తుంది. సరైన కాంతి, కంపోజిషన్, ఎడిటింగ్ టెక్నిక్స్ ఉపయోగించి.. మీరు అద్భుతమైన మేఘాల ఫొటోలు తీసుకోవచ్చు. వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకోండి.. ఆకాశాన్ని నిశితంగా గమనించండి.. మేఘాల అందాన్ని ఫొటోగా మార్చండి!
…? ఆడెపు హరికృష్ణ