కాజు అండ్ నట్స్ లడ్డు
కాజు, నట్స్ ఆరోగ్యానికి మేలు చేసేవి. వీటితో చాలా వెరైటీలు చేసుకొని తినవచ్చు. కాజు, నట్స్ లడ్డూ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఇంట్లోనే తయారు చేసుకుని ఆస్వాదిద్దాం.
కావలసిన పదార్థాలు
కాజు: ఒకటిన్నర కప్పు
అవిసె గింజలు: ముప్పావు కప్పు
పుచ్చ గింజలు, సన్ ఫ్లవర్ గింజలు, వాల్ నట్స్: పావు కప్పు చొప్పున
గసగసాలు: రెండు టేబుల్ స్పూన్లు
ఖర్జూర పండ్లు: కప్పు
నెయ్యి: ముప్పావు కప్పు
తయారు చేసే విధానం
ముందుగా కాజూని దోరగా వేయించుకోవాలి. అవిసె, పుచ్చలాంటి మిగతా గింజలన్నిటినీ విడివిడిగా వేయించుకొని పక్కన పెట్టాలి. కాజు పప్పులను రెండు గంటలు ఫ్రీజర్‌లో పెట్టాలి. తీసిన తర్వాత పల్స్ మోడ్‌లో వీటిని మిక్సీ పట్టుకోవాలి. అంటే ఒకేసారి మిక్సీని తిప్పితే అవి ముద్ద అయిపోతాయి. అలా కాకుండా కొద్దిగా తిప్పి ఆపి, మళ్లీ తిప్పడం… ఇలా అన్నమాట. దీనివల్ల పప్పు పొడిపొడిగా వస్తుంది. ఇది అయ్యాక మిగతా నట్స్ అన్నింటినీ చాపర్‌లో వేసుకుని బరకగా ఉండేలా తిప్పుకోవాలి. గసగసాలు వేయించి, నెయ్యి వేడి చేసుకోవాలి. తీపి కోసం మన ఇష్టాన్ని బట్టి పదార్థాన్ని ఎంచుకోవచ్చు. ఖర్జూర పండ్లతో చేసుకోవాలంటే స్పూను నెయ్యిలో గింజలు తీసిన కప్పు ఖర్జూరాలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. లేదంటే బెల్లం తురుము (ఒక కప్పు), కాదంటే చక్కెర (ఒకటిన్నర కప్పు) వాడుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పళ్లెంలోకి ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న గింజలతో పాటు ఒక స్పూను గసగసాలు వేసి, నచ్చిన తియ్యదనాన్ని ఇందులో కలపాలి. మిశ్రమం మొత్తం కలిసేలా తిప్పుతూ నెయ్యిని పోసి బాగా కలిపి, ఉండలుగా చుట్టుకోవాలి. మిగిలిన గసగసాలను వీటి పై భాగంలో అద్దితే కాజు అండ్ నట్స్ లడ్డూలు సిద్ధమైపోతాయి.
– ఎం.బాలరాయుడు, పాకశాస్త్ర నిపుణురాలు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Cashew
- Laddu
- Let’s learn
- nuts
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

