రంగం ఏదైనా ఇకమత్ (తెలివి/ఉపాయం) ఉన్నోడిదే రాజ్యం. ఇటువంటి వ్యక్తులకు మంచి భవిష్యత్ ఉంటుంది. కాబట్టే, ‘ఇకమత్ ఉన్నోడు ఉపాసం ఉండడన్నట్లు’ అనే సామెత వచ్చింది. తెలివైనవాళ్లకు ఎక్కడైనా నాలుగు మెతుకులు దొరకక పోవన్న ధైర్యం. ఎన్ని కష్టాలొచ్చినా ఉపాయంతో సులువుగా తప్పించుకోగలరన్న భరోసా. ఇంట్లోని బాధలనూ నివారించుకోగలరు. కానీ, కొందరు బుర్రకు పదునుపెట్టకుండా కడుపు మాడ్చుకుంటారు. ఇలాంటి మరో సామెత, ‘ఇకమత్ లేనోడు ఎవుసం చేస్తే.. ఏటా ఓ ఎకరం ఎండి పోయిందట’.
డప్పు రవి