‘ఫాసిప్లోరేసి’ కుటుంబానికి చెందిన ఈ పువ్వులను ‘పాండవుల పువ్వు’ అని అంటారు. ఒత్తిడిని తగ్గించే మందుల తయారీలో ఈ పూలను ఎక్కువగా వాడుతారు.
కట్లపువ్వు : నీలి రంగులో కనిపించే కట్లపువ్వు శాస్త్రీయ నామం..‘జకు మోంటియా నెంటాథోన్’. ఈ పూలలో డయాబెటిస్, ఇన్ఫ్లమేషన్,క్యాన్సర్‌ను తగ్గించే గుణాలు అపారం.
గులాబీలు : గులాబీ పువ్వులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆయుర్వేదంలో దీనిని శతపత్రి, సౌమ్య గంధ అని పిలుస్తారు. గులాబీ పూల కషాయాన్ని తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. గుండె బలంగా తయారవుతుంది. తలనొప్పిని, మల
బద్ధకాన్ని తగ్గిస్తుంది. కంటి జబ్బులను దూరం చేయడంలోనూ సాయం చేస్తుంది. ముఖ వర్చస్సు పెంచే సౌందర్య సాధనాల్లో గులాబీలదే మొదటిస్ధానం.
రుద్రాక్ష పువ్వు : నీళ్లలో రుద్రాక్ష గింజలు వేసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు దరిచేరవు. పుండ్లు, గాయాలను నయం చేస్తుంది.
నందివర్ధనాలు : ధవళ వర్ణంలో మెరిసే నందివర్ధనాలు.. గొప్ప ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. నేత్ర సంబంధ వ్యాధులను దూరం చేస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
కనకాంబరాలు : కనకంబరాల్లో లెక్కకు మించిన ఔషధ గుణాలున్నాయి. వీటి ఆకులు మంచి యాంటీ ఆక్సిడెంట్లు. నీళ్లలోని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా,
ఫంగస్‌ను నిర్మూలించడంలో ముందుంటాయి.
చామంతి : చామంతి పూలు యాంటి బయోటిక్‌గా పనిచేస్తాయి. జలుబు, గొంతునొప్పిని తగ్గిస్తాయి. నిద్రలేమి, పని ఒత్తిడి వల్ల కండ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు, మొటిమలను తగ్గించడంలోనూ సాయపడుతాయి. కండ్లకు, కాలేయానికి, రక్త ప్రసరణ లోపానికి సంబంధించిన సమస్యలకు చామంతిని మందుగా వాడతారు.
కాశీరత్నం పూలు : ఎరుపురంగులో వెలిగిపోయే కాశీరత్నం పువ్వు..
ఫంగస్‌ను సమర్థంగా అరికడుతుంది. అతి మూత్రవ్యాధి, మలబద్ధకాన్ని అదుపులో ఉంచుతుంది.
నేల గులాబీలు : కాలేయ వ్యాధులు అరికట్టడంలో ఇవి చక్కగా పనిచేస్తాయి. పాము, కీటకాల కాటుకు మందుగానూ ఉపయోగిస్తారు. గజ్జి, తామర లాంటి చర్మ వ్యాధుల నివారణలో నేల గులాబీ విత్తనాలు, ఆకుల రసాన్నీ వాడుతారు. అతిసార, గుండెజబ్బుల నివారణకూ చక్కగా ఉపయోగపడతాయి.
గడ్డి పూలు : బతుకమ్మ పేర్చడంలో వాడే వివిధ రకాల గడ్డి పూలు.. ఉబ్బసం, కోరింత దగ్గు, విరేచనాలను తగ్గిస్తాయి. పిల్లల్లో జ్వరం, కళ్ల మంటలు, నిద్రలో ఏడుపును నివారించడంలో సహకరిస్తాయి. గొంతు, కాళ్ల నొప్పులకు చక్కని మందుగా పనిచేస్తాయి.
సంపెంగలు (లిల్లీ) : ఇది చక్కని క్రిమిసంహారిణి. లిల్లీపూలు గుండె వేగాన్ని అదుపులో ఉంచుతాయి. ప్రసవానంతర వ్యాధులను దరిచేరనీయవు.