చెట్టినాడ్ వీధుల్లో చెట్టాపట్టాల్!
కనడుకథన్.. చెట్టినాడ్ ప్రాంతంలోని సుప్రసిద్ధ చారిత్రక వారసత్వ గ్రామం. శివగంగ జిల్లాలోని కారైకుడికి సమీపంలోని ఈ పల్లె.. అద్భుతమైన చెట్టినాడ్ నిర్మాణ కళకు నిలువెత్తు నిదర్శనం. పురాతన కాలపు జీవనశైలిని, తమిళ సంస్కృతిని తనలో దాచుకున్న ప్రాంతం. చరిత్ర ప్రేమికులు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం.
పల్లె టూర్
నాట్టుకోట్టయ్ వ్యాపారులు నిర్మించిన పెద్ద పెద్ద భవనాలు కనడుకథన్ ప్రధాన ఆకర్షణ. ఈ భవనాలన్నీ చెట్టినాడ్ నిర్మాణ వైభవానికి నిలువుటద్దంలా కనిపిస్తాయి. బ్రిటిష్, ఐరోపా, తూర్పు ఆసియా దేశాల వాస్తుశిల్ప శైలుల కలయికతో ఈ ఇళ్లను నిర్మించారు. మయన్మార్ నుంచి దిగుమతి చేసుకున్న బలమైన టేకు చెక్కతో తలుపులు, కిటికీలను తీర్చిదిద్దారు. ఇక పాలరాతి నేలలు, ఇటాలియన్ టైల్స్, అందమైన రాగి, ఉక్కు స్తంభాలు.. ఈ భవనాలకు రాజసాన్ని తెచ్చిపెట్టాయి. ఈ భవనాలు అన్నిటిలోనూ మరింత ప్రత్యేకమైంది.. చెట్టినాడ్ ప్యాలెస్. ఈ ప్రాంతపు సాంస్కృతిక, నిర్మాణ వైభవానికి తలమానికంగా నిలుస్తుంది.

Kanadukathan
ఈ రాజభవనాన్ని 1912లో నాటి ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇండియన్ బ్యాంక్, అన్నమలై విశ్వవిద్యాలయ స్థాపకుడైన డాక్టర్ రాజా సర్ అన్నమలై చెట్టియార్ నిర్మించారు. నాట్టుకోట్టయ్ నగరం (చెట్టియార్) వ్యాపారుల ఆర్థిక పరిపుష్టికి, కళాభిరుచికి ఈ భవనం అద్దం పడుతుంది. ప్రపంచంలోని పలు దేశాల నుంచి సేకరించిన సామగ్రితో ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. ఇటాలియన్ మార్బుల్స్, బ్రిటిష్ ఉక్కు గ్రిల్స్, బెల్జియం గ్లాస్ షాండ్లియర్లను ప్రత్యేకంగా తెప్పించారు. తలుపులు, కిటికీలు, పైకప్పులపై అద్భుతమైన చెక్కడాలు.. బర్మా నుంచి తెప్పించిన బలమైన టేకు చెక్కతో చేశారు. నేటికీ చెక్కుచెదరకుండా నిలిచిన ఆ శిల్పకళ.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. ఈ చారిత్రక ప్యాలెస్‌లను సందర్శించడానికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. నాటి చెట్టియార్ల రాజసం, వారి జీవనశైలిని ప్రత్యక్షంగా అనుభవిస్తారు. అంతేకాదండోయ్.. ఈ భవనాల్లో వందల సినిమాలు షూటింగ్ జరుపుకొన్నాయి. దక్షిణాదిలోని అన్ని భాషల చిత్రాల్లోనూ ఇవి కనిపిస్తాయి. హస్తకళల్లోనూ అద్భుతమే!

Architecture
తమిళనాడు సంస్కృతి, చేనేత కార్మికుల అద్భుతమైన నైపుణ్యానికి ప్రతీక.. ‘కందంగి’ చేనేత చీరలు. ప్రకాశవంతమైన రంగుల్లో, మిరుమిట్లు గొలిపే గళ్ల డిజైన్లు, చారలతో చూడగానే ఆకట్టుకుంటాయి. ఇక ఇక్కడికి సమీపంలోని అతంగుడి గ్రామంలో తయారయ్యే ‘అతంగుడి టైల్స్’ కూడా చాలా ప్రసిద్ధిగాంచాయి. రంగు రంగుల డిజైన్లతో, చేతితోనే సిమెంట్ టైల్స్ తయారు చేస్తారు. పెద్దపెద్ద భవనాలు, పాతకాలపు ఇళ్లలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చెట్టినాడ్ వంటకాలూ ప్రపంచ ప్రసిద్ధి చెందినవే! శాఖాహారం, మాంసాహారాల్లోనూ చెట్టినాడ్ వంటకాలు భిన్నమైన రుచితో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాయి.

Chettinad Weaver
ఇలా వెళ్లాలి..
కారైకుడి నుంచి 14 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. కనడుకథన్ చేరుకోవచ్చు. తిరుచ్చి, మదురై, చెన్నై వంటి ప్రధాన నగరాల నుంచి రోడ్డు సౌకర్యం ఉన్నది. కనడుకథన్కు సమీపంలోనే ‘చెట్టినాడ్ రైల్వే స్టేషన్’ ఉంది. తిరుచ్చి-రామేశ్వరం రైలు మార్గంలో ఈ స్టేషన్ వస్తుంది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

