మొదటి సినిమాతోనే కుర్రకారు మనసులు దోచిన చిన్నది.. అను ఇమ్మాన్యుయేల్. కొంచెం అందం, కొంచెం అమాయకత్వం కలబోసినట్టు కనిపించడమే అనూ ప్రత్యేకత. ఆ అరుదైన మేళవింపే తొలినాళ్లలో వరుస అవకాశాలు అందించింది. ‘మహా సముద్రం’తో మరోసారి ప్రేక్షకులను పలకరించిన ఈ కేరళ కుట్టి గురించి..