బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Feb 02, 2020 , 15:39:28

చివరి రోజులూ చిత్రలేఖనం మధ్యే..

 చివరి రోజులూ చిత్రలేఖనం మధ్యే..

లెక్కకు మిక్కిలి ప్రణాళికలు.. శాస్త్రీయ, ప్రజానుకూల ఆలోచనలు..ప్రణాళికా బద్ధమైన పనులు...సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలోనే డ్రాయింగ్‌లో విప్లవాన్ని సృష్టించిన విప్లవాత్మకకళాకారుడు. మోనాలిసా చిత్రంతో ప్రపంచానికి ప్రశ్నల వర్షం కురిపించిన చిత్రకారుడాయన. అంతే కాదు సైన్సు, సంగీతం, జీవశాస్త్ర, ఖగోళ శాస్త్రం, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ అన్ని అంశాలూ ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలు. ఆయన చివరి రోజుల కూడా పరిశోధనల మధ్యే ముసిశాయి..ఆయనే లియొనార్డో డావిన్సీ...

1512, ఫ్రెంచ్కంబ్రాయి లీగ్ యుద్ధ సమయం.. ఫ్రెంచ్ నగరంలో లియొనార్డో డావిన్సీ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆ ఏడాది నాటికి త్రిపుల్జియో ఈక్వెస్ట్రియన్ స్మారక చిహ్నం ( గుర్రపు స్వారీ శిల్పం) తయారు చేసే పనిలో ఉన్నాడు. కానీ స్విస్, స్పానిష్, వెనీషియన్ దళాలు ఫ్రెంచ్ పై దాడి చేశాయి. దీంతో ఆ పనికి అవాంతరాలు ఎదురయ్యాయి.  ఈ డాడిలో భాగంగా ఫ్రెంచ్ నుంచి ఆ సమాఖ్య దళాలు మిలాన్‌ను తరిమేసాయి. లియొనార్డో మిలాన్ నగరంలోనే ఉన్నాడు. 1513 వరకూ విల్లాలో అనే ప్రాంతంలో చాలా నెలలు గడిపాడు.  అక్కడ అపోస్టోలిక్ ప్యాలెస్‌లోని బెల్వెడెర్ ప్రాంగణంలో గడిపాడు. సుమారు మూడు సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. లియొనార్డో  అక్కడి పోప్ లియోx కు పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చాడు. దాన్ని ఇష్టపడ్డ పోప్ లియోనార్డోకు పెయింటింగ్ కమిషన్‌ను అప్పగించాడు. దీంతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించాడు. పోప్ అండతో తన కార్యాచరణ మరింత బాగుంటుందని అనుకున్నాడు లియోనార్డో. కొత్త రకమైన వార్నిష్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేశాడు. కొత్త రంగులతో వివిధ పెయింటింగ్స్‌ను సృష్టించాలనుకున్నాడు.  అతను సృష్టించిన కొత్త రంగులతో కొత్త  బొమ్మలు గీయాలన్నది  ఆయన ఆలోచన . కానీ లియొనార్డో డావిన్సీ ప్రయత్నంలో సైన్సును పోప్ అర్థం చేసుకోలేదు. అతను కల్పించిన సౌకర్యాలను లియోనార్డో దుర్వినియోగం చేస్తున్నట్టుగా భావించాడు. దీంతో  లియొనార్డో చేస్తున్న ప్రయోగాలు ఫలించవనే భావనకు వచ్చాడు. అదే సమయంలో లియొనార్డో  అనారోగ్యానికి గురయ్యాడు. అది అతని మరణానికి మొదటి హెచ్చరికగా మారింది.  అదే సమయంలో ఫ్రాన్స్ నుంచి లియొనార్డ్డో డావిన్సీ రోమ్‌కు వెళ్లిపోయాడు.. 


వాటికన్ సిటీ, నగర ఉద్యానవనం...

లియొనార్డో  డావిన్సీ వాటికన్ సిటీ  నగర ఉద్యానవనంలో వృక్షశాస్త్ర పరిశోధలను ప్రాక్టీస్ చేశాడు. పోప్టిన్ ప్రతిపాదిత పొంటిన్ మార్షెస్ ప్రణాళికలను రూపొందించడానికి నియమితుడయ్యాడు. దీంతో పాటు వోకల్ కోర్డ్స్ గురించి గ్రంథం రాయడానికి నోట్స్‌ను సిద్ధం చేశాడు. దీన్ని పోప్ ముందుంచి అతని అభిమానాలను పొందాలని భావించాడు లియోనార్డో. కానీ విజయవంతం కాలేదు. 


1516, అక్టోబర్

ఫ్రాన్స్ రాజు ఫ్రాన్సిస్ రాజు మిలాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఆ రాజుకు ఇరవై ఏండ్లు మాత్రమే. యుక్త వయసులో అతను చుట్టు పక్కల నగరాలను ప్రేమించేవాడు. ఫ్రెంచ్‌లోని తన ప్యాలెస్‌ను, రాజధానిని లోయిర్ వ్యాలీకి తరలించడానికి నిర్ణయించుకున్నాడు. తర్వాత పోప్ లియోx కు రాజు ఫ్రాన్సిస్‌కు  మధ్య సమావేశం జరిగింది. అప్పటికే ఫ్రెంచ్‌లో ప్రసిద్ద కళానిపుణునిగా పేరుసాధించిన లియొనార్డో  సూచనలు తీసుకోవాలని ఫ్రాన్సిస్ అనుకున్నాడు. కాబట్టి  పోప్‌కు, అతనికి జరిగిన సమావేశానికి లియొనార్డో  డావిన్సీని కూడా ఆహ్వానించాడు. అంతిమంగా ఫ్రెంచ్ పెయింటర్‌గా లియొనార్డోను నియమించుకోవాలన్నది రాజు ఆలోచన. ఈ సమావేశం ముగిసే సమయానికి లియోనార్డో ఫ్రాన్సిస్ సేనలో చేరిపోయాడు. ది కింగ్స్ ఫస్ట్ పెయింటర్, ఇంజినీర్, ఆర్కిటెక్చర్‌గా రాజు లియొనార్డో ను నియమించుకున్నాడు.  రాజభవనం పక్కనే ఉన్న క్లోస్ లూస్ అనే భవనాన్ని ఆవాసంగా ఇచ్చాడు. దీని కేంద్రంగా లియొనార్డో  రాజుకు ప్రణాళికలు ఇచ్చేవాడు. ఫ్రాన్సిస్ దీన్ని తరచూ సందర్శిస్తుండే వాడు. లియొనార్డో  ముఖ్యంగా ఫ్రాన్సిస్ నిర్మించబోయే పట్టణం కోసం ప్రణాళికలు సిద్ధం చేశాడు. దీంతో పాటు అనేక పెయింటింగ్ పనులను కూడా నిర్వహించాడు. సహాయంగా స్కెచ్ అర్టిస్టులను ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటికి లియొనార్డో వయస్సు 65 ఏండ్లు.కింగ్స్ అర్టిస్ట్‌గా లియొనార్డో డావిన్సీ నియమితుడైన తర్వాత పూర్తిగా పనిలో నిమగ్నమయ్యాడు. కానీ లియొనార్డో మిలాన్లో నివసిస్తున్నప్పుడే ఒక ప్రణాళిక బద్ధమైన పట్టణం కోసం ఆలోచనలు చేశాడు. 1490లో మిలాన్ నగరం ప్రజారోగ్య సంక్షోభ నగరంగా ఉండేది. ప్రజల వ్యాధులకు సరైన మార్గాలు దొరికేవి కావు. లియొనార్డో డావిన్సీ ఈ పరిస్థితులను మార్చడానికి ఇష్టపడ్డాడు. ముఖ్యంగా పారిశుధ్యం, కలుషిత నీటికి ప్రజలు దూరంగా నివసించేలా ప్రణాళికలు చేశాడు. ఇప్పుడు ఫ్రాన్సిస్ రాజు నిర్మించబోయే నూతన రాజధాని కోసం ఆదర్శవాద ఆలోచనలు కలిగి ఉన్నాడు. దారి మళ్లించిన నదులు, వ్యర్థ జలాలను శుభ్రం చేసే వ్యవస్థ, పట్టణ ప్రజలను మార్చడానికి ముందుగా నిర్చించే ఇండ్లు ఇలాంటి ప్రణాళికలతో లియొనార్డో డావిన్సీ కింగ్ ప్యాలెస్‌లో ఉన్నాడు. ఆ ప్రణాళికలతో నిర్మించతలపెట్టిన నగరం రొమోరాంటిన్. 1517.. లియొనార్డోకు 65 ఏండ్లు

లియొనార్డో డావిన్సీ చివరి సంవత్సరాల్లో అతను ఇటలీ నుంచి తీసుకెళ్లిన మోనాలిసా చిత్రాన్ని పూర్తి చేయడం, మరికొన్ని ప్రణాళికలను గీయడం కోసం కేటాయించాడు.  అప్పటి వరకూ మల్టిపుల్ స్ట్రోక్స్‌తో ఎదుర్కొన్న లియోనార్డో ఈసారి మరో అనారోగ్య సమస్య ఎదుర్కొన్నారు. 65 ఏండ్ల వయస్సులో అతని కుడిచేయి పక్షవాతానికి గురైనట్టు నిర్ధారణ అయింది. చివరికి అనారోగ్యానికి గురై చాలా నెలలు మంచాన పడ్డాడు. అయినా కొంత సామర్థ్యంతోనే పని చేసూ  ఉన్నాడు.  1519, ఫ్రాన్సిస్ రాజ భవనం..

లియొనార్డో డావిన్సీ   చేసిన పరిశోధనలు, రాసుకున్న డాక్యుమెంట్లు అన్నీ అతనికి మాత్రమే అర్థమయ్యేలా రాసుకున్నాడు. 1519నాటికి అతను ఉంటున్న ప్యాలెస్ రూంలో గుట్ట్టలు గుట్టలుగా చిత్రాలు, డాక్యుమెంట్లు, ప్రణాళికలు పోగయ్యాయి.  ఆరవై ఏండ్లు దాటిని లియొనార్డో ఆరోగ్య పరిస్థితులు మరింత క్షీణించాయి. అతని పరిశోధనలు భవిష్యత్ తరానికి ఎలా అందించాలి అనే ఆలోచన మెదడును కలిచి వేసింది. శాస్త్రీయ విధానాలతో   రూపొందించిన ఆయన ప్రణాళికలు భవిష్యత్ తరాలకు అందకపోతే   చేతకాని వాడిలా భావిస్తారేమో అని బాధపడ్డాడు. వేల కొద్ది చేసిన రిసెర్చ్ కాగితాలు, ఛేదించిన రహస్యాలు, నగరాల నమూనాలు ఇవ్వన్నీ ఆగిపోవాల్సిందేనా అని దు:ఖించాడు. ప్యారాచూట్లు, యుద్ధ్ద ట్యాంకర్లు, విమానాలు మనం ఇప్పుడు వింటున్నవి. కానీ ఆయన ఆ కాలంలోనే వాటికి డ్రాయింగ్‌లు వేశాడు. సైన్సు, సంగీతం, శిల్పకళ, వృక్షశాస్త్రం, ఖగోళశాస్త్రం, జీవశాస్త్రం, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్  అంశాలు ఆయనకు వెన్నతోపెట్టిన విద్య.  యూనివర్స్ ఆఫ్ జీనియస్ అనే బిరుదుకు లియొనార్డో డావిన్సీ అర్హుడని అందరూ భావించారు. కానీ మోనాలిసా చిత్రంతోనే అతను ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు.  ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఏ మాత్రమూ లేని కాలంలో ఆయన అనేక బహుళ రంగాలలో పరిశోధనలు జరిపిన మేధావి లియొనార్డో డావిన్సీ...

ప్యారాచూట్లు, యుద్ధ్ద ట్యాంకర్లు, విమానాలు మనం ఇప్పుడు వింటున్నవి. కానీ ఆయన ఆ కాలంలోనే వాటికి డ్రాయింగ్‌లు వేశాడు. సైన్సు, సంగీతం, శిల్పకళ, వృక్షశాస్త్రం, ఖగోళశాస్త్రం, జీవశాస్త్రం, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్  అంశాలు ఆయనకు వెన్నతోపెట్టిన విద్య.  యూనివర్స్ ఆఫ్ జీనియస్ అనే బిరుదుకు 

లియొనార్డో డావిన్సీ అర్హుడని అందరూ భావించారు.


1519 .. చివరి ఘడియలు

లియొనార్డో డావిన్సీ తను గీసిన ప్రణాళికలను, చిత్రాలను చూసుకుంటూ ఉన్నాడు. భవిష్యత్‌లో ఈ సంపద ఏమైపోతుందోనన్న దిగులు అతన్ని వెంటాడింది. ఆహారం తీసుకోవడం మానేశాడు. వారం రోజులు ఆ డాక్యుమెంట్లను చూసుకుంటేనే బలహీన పడ్డాడు. కుడి చేయి పక్షవాతం, క్షీణించిన ఆరోగ్యం, త్రీవమైన దిగులు అతన్ని మరణంవైపు నెట్టేశాయి. చివరికి మే 2న రాజు కేటాయించిన భవనంలోనే అతను మరణించాడు. 15వ శతాబ్దంలోనే శాస్త్రీయ, ప్రజానుకూల ప్రణాళికలను ఆలోచించిన విప్లవకళాకారుడు లియొనార్డో డావిన్సీ.. తను సృష్టించిన మేధోసంపదను భవిష్యత్ తరాలకు అందించలేనేమో అన్న ఆవేదనతోనే తుదిశ్వాస విడిచారు.

వినోద్ మామిడాల, సెల్: 7660066469


logo