Mansi Gambhir | ప్రేమపూర్వక ఫ్యాషన్
వీగనిజం.. ఆహారంతో మొదలై ఫ్యాషన్‌కు విస్తరించింది. జీవహింసకు తావులేని అహింసా వస్తువులను కోరుకుంటున్నారు చాలామంది. ముంబై నివాసి మాన్సీ గంభీర్ దీన్నో వ్యాపార అవకాశంగా భావించారు. ‘గస్టో’ పేరుతో వీగన్ బ్రాండ్ సృష్టించారు.
వీగనిజం.. ఆహారంతో మొదలై ఫ్యాషన్‌కు విస్తరించింది. జీవహింసకు తావులేని అహింసా వస్తువులను కోరుకుంటున్నారు చాలామంది. ముంబై నివాసి మాన్సీ గంభీర్ దీన్నో వ్యాపార అవకాశంగా భావించారు. ‘గస్టో’ పేరుతో వీగన్ బ్రాండ్ సృష్టించారు. తోలు ప్రమేయం లేకుండా.. గస్టో అందించే హ్యాండ్ బ్యాగులకు, ల్యాప్‌టాప్ బ్యాగులకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ‘బాధ్యతాయుతమైన, హింసకు తావులేని ఫ్యాషన్‌ను మేం ప్రమోట్ చేస్తున్నాం.
మన ఆహ్లాదం కోసం మూగజీవుల ప్రాణాలు తీయడం అమానుషం’ అంటారు మాన్సీ. తను ఇంజినీరింగ్ పట్టభద్రురాలు. ఇన్ఫోసిస్, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ తదితర సంస్థలలో పనిచేశారు. మాన్సీ స్వతహాగా ఫ్యాషన్లను ప్రేమిస్తారు. కానీ, ప్రతి ఉత్పత్తిలోనూ ఏదో ఓ రూపంలో జంతువుల చర్మాన్ని వాడటం.. సున్నిత మనస్కురాలైన మాన్సీకి నచ్చలేదు. అందులోనూ వీగన్‌గా మారాక.. ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట మొదలు పెట్టారు. కానీ, ఎక్కడికెళ్లినా నిరాశే. దీంతో తనే ఓ బ్రాండ్‌కు ప్రాణం పోశారు. ‘మీకంటూ ఓ లక్ష్యాన్ని సిద్ధం చేసుకోండి. ఆ వైపుగా అడుగులు వేయండి. ప్రయాణంలోని ప్రతి మజిలీనీ ఆస్వాదించండి. గెలుపు దాతనంతట అదే మిమ్మల్ని వరిస్తుంది’ అని తోటి మహిళలకు సలహా ఇస్తారు మాన్సీ గంభీర్.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

