హస్తకళలకు ఆదరణ తగ్గుతున్నది. చవకగా దొరికే వస్తువులు వాటికి ప్రత్యామ్నాయం అవుతున్నాయి. నాణ్యమైన హస్తకళలు మార్కెట్లో అందుబాటులో లేకపోవడం, దళారుల దోపిడి మరొక సవాలు. ఇందుకు ఓ పరిష్కారం కనిపెట్టారు దృష్టి అనే ఆర్ట్ ఆంత్రప్రెన్యూర్. గుజరాత్‌కు చెందిన దృష్టి తన సహచరుడు హరేశ్తో కలిసి ఓ ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించారు.
రాష్ట్రంలోని హస్తకళాకారులు తమ ఉత్పత్తులను నేరుగా ఇక్కడ అమ్ముకోవచ్చు. ఓ చిన్న ఆలోచనగా ఆరంభమైన ఈ వెబ్సైట్ హస్తకళలే జీవికగా ఉన్నవారికి సరికొత్త ఊపిరి అందిస్తున్నది. తయారీదారులకు, వినియోగదారులకు వారధిగా నిలుస్తున్నది. ఈ ఆన్లైన్ పోర్టల్ ప్రభుత్వరంగ సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో ఉంది.
క్రమంగా వివిధ ప్రాంతాల్లోని హస్తకళాకారులు అందరికీ పోర్టల్‌లో చోటు కల్పిస్తామని చెబుతున్నారు దృష్టి. భౌగోళిక గుర్తింపు ఉన్న ప్రతి స్థానిక ఉత్పత్తినీ తమ వేదిక మీదికి తీసుకురావడమే లక్ష్యమని అంటున్నారు. kalahouse.inలో వర్చువల్‌గా అడుగుపెట్టిన ఎవరైనా దృష్టి ప్రయత్నాన్ని అభినందించకుండా ఉండలేరు.