హెల్దీ లడ్డూ కావాలా!
లడ్డూలంటే.. మనవాళ్లకు ఎంతో ఇష్టం! పెండ్లి భోజనంలో లడ్డూ వడ్డన శుభప్రదం. తిరుపతి లడ్డూ అదృష్ట సూచకం. ‘ఇవ్వండి లడ్డూ’ అని అల్లుడుగారు ఆప్యాయంగా అడిగి మరీ వేయించుకునే చొరవ లడ్డూ కల్పిస్తుంది! ఈ లడ్డూలకు కొత్త భాష్యం చెబుతున్నారు గోపు కవిత.
లడ్డూలంటే.. మనవాళ్లకు ఎంతో ఇష్టం! పెండ్లి భోజనంలో లడ్డూ వడ్డన శుభప్రదం. తిరుపతి లడ్డూ అదృష్ట సూచకం. ‘ఇవ్వండి లడ్డూ’ అని అల్లుడుగారు ఆప్యాయంగా అడిగి మరీ వేయించుకునే చొరవ లడ్డూ కల్పిస్తుంది! ఈ లడ్డూలకు కొత్త భాష్యం చెబుతున్నారు గోపు కవిత. ఐటీ ఉద్యోగం వదిలి, విదేశాల్లో కొలువు కాదనుకొని ‘లడ్డూ బాక్స్’ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఆమె స్థాపించిన తీపి పేటికలోని అన్ని లడ్డూలూ కమ్మదనాన్ని రుచి చూపించేవే! అంతకుమించి ఆరోగ్యాన్ని ప్రసాదించేవే! స్త్రీ శక్తిని చాటుతూ పోషకాల రుచులను పంచుతున్న ఈ ఆంత్రప్రెన్యూర్ జిందగీతో పంచుకున్న స్టార్టప్ స్టోరీ చదివేయండి.

జీవన ప్రయాణం ఒక్కతీరుగా ఉంటే థ్రిల్ ఏం ఉంటుంది? జర్నీలో ఊహించని మలుపులు ఉండాలి. ఆ మలుపుల్లో గెలుపును అందిపుచ్చుకుంటే కలిగే సంతృప్తిని మాటల్లో వర్ణించలేం. నా ప్రయాణమూ అలాంటిదే! బాల్యం, చదువు సంధ్యలు పక్కనపెడితే.. ఐటీలో ఉద్యోగం సాధించి చిన్నవయసులోనే జీవితంలో స్థిరపడ్డాను. మా ఆయన కూడా ఐటీ నిపుణుడే! ఉద్యోగంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. ఇద్దరమూ విదేశాలకు వెళ్లాం. ఎంత సంపాదించినా లైఫ్ రొటీన్‌గా ఉంటే బోరింగే కదా! ఐటీ ఉద్యోగంలో సంపాదన గొప్పగానే ఉంటుంది కానీ, సంతృప్తి మాత్రం అరుదుగా దొరుకుతుంది. ఆ సంతృప్తి కోసమే.. ఏదైనా కొత్తగా చేయాలనే ఎప్పుడూ అనుకునేదాన్ని. అలా నిరంతర ఆలోచనలు నన్ను స్వదేశానికి వచ్చేలా చేశాయి.

పసందైన రుచి పంచాలని…
హైదరాబాద్‌కు వచ్చాక ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నా. ఆంత్రప్రెన్యూర్‌గా నన్ను నేను నిరూపించుకోవడానికి, గొప్పగా నిలదొక్కుకోవడానికి నలుగురికీ ఉపయోగపడే రంగాన్ని ఎంచుకోవాలని అనుకున్నాను. కోట్లు కుమ్మరించి వ్యాపారం మొదలుపెట్టి రిస్క్‌తో సావాసం చేయడం కన్నా.. తక్కువ పెట్టుబడితో నిదానంగా స్థిరపడటం మేలు అని భావించాను. అప్పటికే కూడబెట్టిన డబ్బులతో వ్యాపారం మొదలుపెట్టాను. రెగ్యులర్ ఫుడ్ బిజినెస్ కాకుండా, కొంత భిన్నంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇందుకోసం మార్కెట్ స్థితిగతులను సమీక్షించేదాన్ని. వినియోగదారులు ఎలాంటి ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తున్నారో తెలుసుకుంటూ, ఎన్నో పరిశోధనలు చేశాను. ఎన్నో ఆలోచనలు, మరెన్నో విశ్లేషణలు, మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆహార ఉత్పత్తులు స్టడీ చేశాను. అన్నిటినీ బేరీజు వేసుకొని పదిమందికీ పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ‘లడ్డూ బాక్స్’ ప్రారంభించాను. వైవిధ్యమైన రుచితోపాటు నాణ్యతతో కూడిన మేలైన పదార్థాలకు ఆదరణ ఉంటుందని నమ్మి ఈ వ్యాపారానికి శ్రీకారం చుట్టాను.

గతి మార్చిన కరోనా
అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మనిషి గొప్పతనం ఏముంటుంది? ‘లడ్డూ బాక్స్’ మొదలుపెట్టిన కొన్నాళ్లకే మంచి ఆదరణ వచ్చింది. ఊహించిన దానికన్నా జోరుగా అమ్మకాలు సాగేవి! వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తున్న తరుణంలో కరోనా కల్లోలం మొదలైంది. మా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. బ్రాండ్ పేరుతో అమ్మకాలు చేసే స్థాయి నుంచి కనీసం నలుగురు వచ్చినా చాలు అనుకునే స్థితికి వచ్చేశాం. కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో హెల్దీఫుడ్ వైపు అడుగులు వేశాను. పోషకాలను దట్టించి ఆరోగ్యాన్ని ప్రసాదించే లడ్డూలు, చిరుతిళ్లు తీసుకొచ్చాం. ఫిట్నెస్ ఫ్రీక్, షీ పవర్ లడ్డూ, కిడో జాయ్ లడ్డూ, హోల్సమ్ గ్రెయిన్ లడ్డూ, మిల్లెట్ మేనియా లడ్డూ, లవ్లీ లెంటిల్స్, మిక్స్డ్ చిక్కీబాక్స్, ఆసర్టెడ్ లడ్డూ పేరిట చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్లతో చేసిన లడ్డూలు, ఆహార పదార్థాలు అందుబాటులోకి తెచ్చాం. ఇంట్లో నలుగురు ఉన్నారంటే.. వాళ్ల వయసు, లింగభేదం, చేసే పనులను బట్టి వారి అవసరానికి అనుగుణంగా వీటిని రూపొందించాం. ఈ వెరైటీలకు మంచి ఆదరణ లభిస్తున్నది. క్రమంగా వ్యాపారం పుంజుకుంది. ఇప్పుడు మరిన్ని వెరైటీలు అందివ్వడానికి సిద్ధమవుతున్నాం.
వీ హబ్ మద్దతుతో..
కరోనా సమయంలో వీ హబ్ మద్దతుగా నిలిచింది. ఎప్పుడైతే వీ హబ్‌ను ఆశ్రయించామో.. అప్పటినుంచి మా వ్యాపార స్వరూపమే మారిపోయింది. కస్టమర్లకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు తయారుచేసే వీలు దొరికింది. నా ఆలోచనలను అమలు చేయడానికి వీ హబ్ తగిన అవకాశాలు కల్పించింది. ఒకప్పుడు ముడి సరుకులు సాధారణ హోల్‌సేల్ మార్కెట్లో కొనుగోలు చేసేదాన్ని. వీ హబ్ చొరవతో నేరుగా రైతుల నుంచే నాణ్యమైన దినుసులు తీసుకునే వెసులుబాటు దొరికింది. వినియోగదారులను మెప్పించేలా పదార్థాలు తయారు చేయగలుగుతున్నాం. ప్యాకింగ్, మెనూ తయారీ నుంచి ప్రొడక్ట్‌లు లాంచ్ చేసే వరకూ ప్రత్యేకంగా నిలిచాం అంటే.. అందుకు వీ హబ్ చొరవే కారణం అని చెబుతాను. ఒకప్పుడు మా ఉత్పత్తులను ఓ గేటెడ్ కమ్యూనిటీలో పంచుకునే స్థాయి నుంచి ఇప్పుడు వేలాది మంది కస్టమర్లకు చేరువ చేయగలిగాం. ప్రస్తుతం మా ‘లడ్డూ బాక్స్’ తీపి రుచుల ఖజానాగా హైదరాబాదీలను అలరిస్తున్నది.
– కడార్ల కిరణ్
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

