Brooklyn Curry Project | అమెరికా వీధుల్లో మన ఇడ్లీ, దోసె.. ఈమె అమ్మే టిఫిన్ల కోసం కిలోమీటర్ల నుంచైనా వచ్చేస్తారు!
Brooklyn Curry Project | నేతి వాసనలు, దోసె ఘుమఘుమలు, సాంబారు పొగలు.. పిజ్జాబర్గర్ల ప్రియులు పార్టీ ఫిరాయించేలా చేస్తున్నాయి. తొమ్మిదేండ్ల క్రితం బెంగళూరు నుంచి అమెరికాలోని బ్రూక్లిన్ స్ట్రీట్‌కు వలస వెళ్లిన శ్వేత, వెంకట్రాజు దంపతులు దక్షిణాది రుచులతో వేడివేడి ఫలహారాలు వడ్డిస్తున్నారు.
Brooklyn Curry Project | నేతి వాసనలు, దోసె ఘుమఘుమలు, సాంబారు పొగలు.. పిజ్జాబర్గర్ల ప్రియులు పార్టీ ఫిరాయించేలా చేస్తున్నాయి. తొమ్మిదేండ్ల క్రితం బెంగళూరు నుంచి అమెరికాలోని బ్రూక్లిన్ స్ట్రీట్‌కు వలస వెళ్లిన శ్వేత, వెంకట్రాజు దంపతులు దక్షిణాది రుచులతో వేడివేడి ఫలహారాలు వడ్డిస్తున్నారు. ధర కూడా తక్కువే. వెంకట్ వృత్తిరీత్యా లాయర్. తొలి రోజుల్లో కమ్మని మసాలా దోసె కోసం ఊరంతా వెతికినా ఫలితం ఉండేది కాదు. దీంతో చచ్చినట్టు ఇంట్లోనే చేసుకునేవారు. స్కూల్ ఫెస్ట్‌లో కూతురు నడిపిన లెమనాయిడ్ స్టాల్ తమకు కొత్త వ్యాపార ఆలోచన ఇచ్చిందని చెబుతారు ఆ దంపతులు. ఉదయం పదిన్నరకు బ్రూక్లిన్ కర్రీ ప్రాజెక్ట్ (బీసీపీ) తలుపులు తెరుచుకుంటాయి.
స్టాక్ ఉన్నంతసేపు వ్యాపారం నడుస్తుంది. స్థానికంగా జరిగే వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ దక్షిణాది రుచుల స్టాల్స్ ఏర్పాటు చేస్తారు శ్వేత, రాజు. ‘కస్టమర్లు మెచ్చుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. మీ రుచులు ఇండియాలోని అమ్మానాన్నల్ని గుర్తుకు తెచ్చాయి.. అని ఎవరైనా చెప్పినప్పుడు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుంది’ అంటారు ఆ ఆలూ మగలు. దాంతోపాటే, భారతీయ రుచులు అంటే టిక్కా మసాలా మాత్రమే కాదని అమెరికాలో చాటి చెప్పడమే బ్రూక్లిన్ కర్రీ ప్రాజెక్ట్ (బీసీపీ) లక్ష్యమని ప్రకటిస్తారు కూడా. ఇడ్లీ, వడ, కిచిడీ, ఊతప్పం, ఉప్మా.. ఎన్ని రుచులున్నా మసాలా దోసె కోసమే జనం కిలోమీటర్ల దూరం నుంచీ వస్తారని సంబురంగా చెబుతూ మనకూ ఓ కడక్ దోసె వడ్డిస్తారు.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

