Doping Test : ఒలింపిక్ విజేత, జమైకా స్టార్ అథ్లెట్ రొనాల్డ్ లెవీ(Ronald Levy) డోప్ పరీక్షలో పట్టుబడ్డాడు. యాంటీ డోపింగ్ కమిషన్ నిర్వహించిన డోప్ టెస్టులో దొరికిపోయాడు. ఈ విషయాన్ని రొనాల్డొ స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. ‘నా కెరీర్లో ప్రతి డోప్ టెస్టు మాదిరిగానే ఈసారి కూడా నెగెటివ్ వస్తుందని ఊహించా. కానీ, నేను నిషిధిత డ్రగ్ వాడినట్టు జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ నుంచి నవంబర్ 2న లెటర్ రావడంతో ఆశ్చర్యపోయాను. అందుకని నేను బి శాంపిల్ టెస్టుకు సిద్ధమయ్యాను. ఆ ఫలితాలు రావాల్సి ఉంది’ అని రొనాల్డో రాసుకొచ్చాడు.
అంతేకాదు.. తాను ఆటను ఎంతో గౌరవిస్తానని, స్వీయ ప్రయోజనాల కోసం అడ్డదారులు తొక్కలేదని రొనాల్డో పేర్కొన్నాడు. మరోవిషయం ఏంటంటే.. ఈ స్టార్ అథ్లెట్ ఈ మధ్యే ఎంవీపీ ట్రాక్ క్లబ్ నుంచి ఎలైట్ ఫర్మార్మెన్స్‌కు మారాడు. టోక్యో ఒలిపింక్స్‌లో 110 మీటర్ల హర్డిల్స్ పోటీపడిన రొనాల్డో కాంస్య పతకం గెలిచాడు.