Fakhar Zaman | చావోరేవో మ్యాచ్‌లో సూపర్ సెంచరీ.. పాక్ ఓపెనర్‌కు రివార్డు ప్రకటించిన పీసీబీ
Fakhar Zaman : వన్డే ప్రపంచకప్‌లో చావోరేవో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్(Fakhar Zaman) విధ్వంసం సృష్టించాడు. న్యూజిలాండ్‌పై అటాకింగ్ గేమ్‌తో సూపర్ సెంచరీ(126 నాటౌట్) సాధించి ఒక్కసారిగా హీరో అయ్యాడు. సంచలన బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టును సెమీస్ రేసులో నిలిపిన...
Fakhar Zaman : వన్డే ప్రపంచకప్‌లో చావోరేవో మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్(Fakhar Zaman) విధ్వంసం సృష్టించాడు. న్యూజిలాండ్‌పై అటాకింగ్ గేమ్‌తో సూపర్ సెంచరీ(126 నాటౌట్) సాధించి ఒక్కసారిగా హీరో అయ్యాడు. సంచలన బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టును సెమీస్ రేసులో నిలిపిన జమాన్‌పై పాక్ మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నాడు.
పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు జకా అష్రఫ్(Zaka Ashraf) ఓ అడుగుముందేకేసి అతడికి ఒక మిలియన్ పాకిస్థాన్ రూపాయలు (భారత కరెన్సీలో రూ.2 లక్షలు) రివార్డు ప్రకటించాడు. బెంగళూరులో వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో చివరకు డక్‌వర్త్ పద్ధతిలో పాక్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది.
.@FakharZamanLive stands tall with a terrific effort 🌟🥇#NZvPAK | #CWC23 | #DattKePakistani pic.twitter.com/eGiXuZ3KJN
— Pakistan Cricket (@TheRealPCB) November 4, 2023
బెంగళూరులో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర(108), విలియమ్సన్(95) దంచికొట్టడంతో భారీ స్కోర్ చేసింది. కివీస్ నిర్దేశించిన 401 పరుగుల ఛేదనలో.. ఫఖర్ (81 బంతుల్లో 126 నాటౌట్; 8 ఫోర్లు, 11 సిక్సర్లు) కివీస్ బౌలర్లతో చెడుగుడు ఆడుకోగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు.
నాలుగో బ్యాటర్‌గా రికార్డు
సంచలన బ్యాటింగ్‌తో జట్టును ఒడ్డున పడేసిన ఫఖర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఈ మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాదిన ఫఖర్.. వరల్డ్ కప్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం పాక్ 10 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. నవంబర్ 11న కోల్‌కతాలో ఇంగ్లండ్‌తో బాబర్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే .. పాక్ సెమీస్ బెర్తు దక్కే చాన్స్ ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

