FIFA World Cup 2026 | ‘జీ’లో ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లు.. 8 ఏళ్లకు ఒప్పందం ఖరారు..!
FIFA World Cup 2026 : భారత్‌లో ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లు ఎక్కడ చూడాలి? అనే సందిగ్ధతకు తెరపడింది. ప్రసార హక్కుల కోసం పలు సంస్థలు పోటీపడగా చివరకు జీ మీడియా (Zee Entertainment) సంస్థ హస్తగతం చేసుకుంది.
FIFA World Cup 2026 : భారత్‌లో ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లు ఎక్కడ చూడాలి? అనే సందిగ్ధతకు తెరపడింది. ప్రసార హక్కుల కోసం పలు సంస్థలు పోటీపడగా చివరకు జీ మీడియా (Zee Entertainment) సంస్థ హస్తగతం చేసుకుంది. ఫిఫా, జీ మధ్య ఎనిమిదేళ్ల కాలానికి ఒప్పందం కుదిరింది. అంటే.. 2034 వరకూ భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను జీ సంస్థ టెలీకాస్ట్ చేసుకుంది. ఈ కాలంలో ఫిఫాకు సంబంధించిన 34 ఈవెంట్లను కూడా ఈ సంస్థ ప్రసారం చేయనుంది.
ప్రముఖ మీడియా సంస్థ రైటర్స్ కథనం ప్రకారం వరల్డ్‌కప్ ప్రసార హక్కులను ఫిఫా రూ. 948 కోట్లు అమ్మాలనుకుంది. అయితే.. రూ. 500 కోట్లకు జీ సంస్థ ప్రసార హక్కులు సొంతం చేసుకుంది. నాలుగేళ్ల క్రితం ఖతార్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌ను రిలయన్స్ – డిస్నీ సంయుక్త కంపెనీ అయిన జియో హాట్‌స్టార్‌లో అభిమానులు వీక్షించారు.
ఈసారి కూడా రిలయన్స్‌కు చెందిన వైకోమ్ 18 సంస్థ హక్కుల కోసం గట్టిగానే ప్రయత్నించింది. రూ.200 కోట్లకు వైకోమ్ 18 బిడ్ వేయాలనుకుంది. కానీ, ఫిఫా యాజమాన్యం అంత తక్కువకు వరల్డ్‌కప్ మ్యాచ్ ప్రసారాలకు అంగీకరించం అని నిరాకరించింది.
‘Z’ partners with FIFA to bring 39 global football events including FIFA World Cup 2026™, FIFA World Cup 2030™ & FIFA Women’s World Cup™ 2027 for Indian fans!
Click here to read more: https://t.co/ikr5nUF1Ck#FIFAWorldCup #WorldCup2026 #FIFAonZ pic.twitter.com/jQodlVJh7T
— ZEE (@ZEECorporate) June 1, 2026
చివరకు.. జీ సంస్థ రూ.500 కోట్లకు హస్తగతం చేసుకంది. అంతేకాదు కొత్తగా నాలుగు ఛానెళ్లను ప్రారంభించినట్టు సంస్థ వెల్లడించింది. యునైట్ 8 స్పోర్ట్స్ 1, యునైట్ 8 స్పోర్ట్స్ 1 హెచ్డీ, యునైట్ 8 స్పోర్ట్స్ 2, యునైట్ 8 స్పోర్ట్స్ 2 హెచ్‌డీలను ఆరంభించామని.. సాకర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 జూన్ 11న మొదలవ్వనుంది. అమెరియా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో 48 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి.
🚨 BREAKING!!
Zee has been confirmed as the broadcaster for the FIFA World Cup in India. ⚽🇮🇳🇮🇳
The network has secured media rights for the 2026 and 2030 FIFA World Cups, the 2027 FIFA Women’s World Cup, along with several other major FIFA tournaments through to 2034. ⚽🥡… pic.twitter.com/PZIZdvZHBj
— Khel Now (@KhelNow) June 1, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

