Yuvraj Singh | ఐదు సిక్సర్లు చాలనుకున్నా.. అతడిపై కసితోనే ‘ఆ రికార్డు’
Yuvraj Singh : పొట్టి ప్రపంచ కప్‌లో రికార్డు వీరులు ఎందరున్నా.. అందరికీ గుర్తుకొచ్చే మొదటి పేరు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh). ఆ మ్యాచ్‌లో తాను అంతలా చెలరేగడానికి కారణం ఏం చెప్పాడో తెలుసా..?
Yuvraj Singh : పొట్టి ప్రపంచ కప్‌లో రికార్డు వీరులు ఎందరున్నా.. అందరికీ గుర్తుకొచ్చే మొదటి పేరు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh). ఆరంభ సీజన్లో ఈ స్టార్ ఆటగాడు ఆరు సిక్సర్లతో రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ప్రపంచ కప్ అంబాసిడర్ (Ambassador)గా ఉన్న యూవీ తన సిక్సర్ల ఫీట్‌పై స్పందించాడు. తొలుత తాను ఐదు సిక్సర్లు కొట్టాలని మాత్రమే అనుకున్నానని.. అయితే ఆరో సిక్సర్‌తో చరిత్ర సృష్టించడం గొప్ప అనుభూతి అని యూవీ చెప్పాడు. ఆ మ్యాచ్‌లో తాను అంతలా చెలరేగడానికి కారణం ఏం చెప్పాడో తెలుసా..?
‘ఆరు సిక్సర్ల ఫీట్‌కు కారణం దిమిత్రి మస్కరెన్హాస్ (Dimitri Mascarenhas). అతడు నా బౌలింగ్‌లో 5 సిక్స్‌లు బాదాడు. దాంతో, నేను కూడా వాళ్ల బౌలర్‌ను ఉతికేస్తూ ఐదు సిక్సర్లు కొట్టాలని డిసైడయ్యాను. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ ఓవర్లో తొలుత వరుసగా ఐదు సిక్సర్లు కొడితే చాలని అనుకున్నా. అయితే.. ఆఖరి బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపకుండా ఉండలేకపోయాను’ అని యువరాజ్ వెల్లడించాడు.
అసలేం జరిగిందంటే..?
భారత జట్టు 2007లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. అప్పుడు యువరాజ్ బౌలింగ్‌లో ఇంగ్లీష్ బ్యాటర్ దిమిత్రి మస్కరెన్హాస్ వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. ఆ క్షణమే తాను కూడా ఇంగ్లండ్ బౌలర్‌పై ఐదు సిక్సర్లతో బదులివ్వాలని యూవీ గట్టిగా అనుకున్నాడు.
యువరాజ్, దిమిత్రి మస్కరెన్హాస్

ఆ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఆ టైమ్ రానే వచ్చింది. సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌పై యూవీ ప్రతాపానికి స్టువార్ట్ బ్రాడ్ బలిపశువు అయ్యాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ (Andrew Flintoff) కవ్వించడంతో కోపంతో ఊగిపోయిన యువరాజ్ ఆ తర్వాతి ఓవర్ వేసిన బ్రాడ్‌కు చుక్కలు చూపిస్తూ.. ఏకంగా ఆరు సిక్సర్లతో రివెంజ్ తీర్చుకున్నాడు.
ఇవి కూడా చదవండి
- Vodafone Idea | ఐదేండ్ల గరిష్టానికి వొడాఫోన్ ఐడియా షేర్.. కారణమిదేనా..?!
- Samantha | జోన్ మిచెల్‌తో సమంత.. ఇంతకీ ఏ సెషన్లో పాల్గొన్నదంటే..?
- Mahindra XUV700 | మహీంద్రా ఎక్స్‌యూవీ 700 లాండ్ మార్క్ రికార్డు.. 33 నెలల్లో రెండు లక్షలు దాటిన సేల్స్..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

