హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్, జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో యువ స్విమ్మర్ అశ్వత్ మూడు స్వర్ణాలు సహా రెండు రజత పతకాలతో సత్తాచాటాడు.
బాలుర సబ్‌జూనియర్ 200మీటర్ల విభాగంతో పాటు 100మీటర్ల బటర్‌ఫ్లై, 50మీటర్ల బటర్‌ఫ్లైలో 11 ఏండ్ల అశ్వత్ పసిడి పతకాలను ముద్దాడాడు. అదే జోరు కొనసాగిస్తూ 100మీ బ్రెస్ట్‌స్ట్రోక్, 50మీ బ్రెస్ట్‌స్ట్రోక్‌లో రెండు రజత పతకాలు సొంతం చేసుకున్నాడు.