టీమ్ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా మాదిరిగానే బౌలింగ్ చేస్తున్న ఈ అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
రనప్, బంతిని పట్టుకునే విధానం, వేగంతో పాటు బాల్ డెలివరీ దాకా ఆమె బుమ్రా బౌలింగ్ శైలిని అచ్చుగుద్దినట్టు దింపేస్తోంది.
మెల్బోర్న్లో చారిత్రాత్మక టెస్టు
మెల్బోర్న్: క్రికెట్లో అసలైన మజాను, క్రికెటర్ల ఫిట్నెస్తో పాటు ఆటకు పరీక్షగా నిలిచే ‘టెస్టులు’ మొదలై 2027 నాటికి 150 ఏండ్లు పూర్తికాబోతున్న సందర్భంగా అగ్రశ్రేణి క్రికెట్ జట్లు అయిన ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ ఈ వేడుకలో భాగం కాబోతున్నాయి.
టెస్టు క్రికెట్ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రెండు జట్ల మధ్య జరుగబోయే ఏకైక టెస్టుకు ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం (ఎంసీజీ) ఆతిథ్యమివ్వనుంది. 1877 మార్చిలో ఇవే రెండు జట్ల మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు మెల్బోర్న్ ఆతిథ్యమివ్వడం గమనార్హం. మొదటి టెస్టులో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌పై 45 పరుగుల తేడాతో గెలిచింది.